తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదైనా సినిమాలో  రెయిన్ సాంగ్ ఉంది అంతే   చాలు దానికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే . ఇక రైన్  సాంగ్స్ సార్ హీరోల సినిమాల్లో ఉన్నాయంటే ఆ కిక్కే  వేరు. సినిమాల్లో రైన్ సాంగ్  ఉంది అంటే ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణ దొరుకుతుంది సినిమాకు . అయితే ప్రస్తుతం సీనియర్ హీరోలుగా ఒకప్పుడు స్టార్ హీరోగా  కొనసాగిన హీరోలందరూ... అప్పట్లో ఎన్నో సినిమాల్లో రైన్ సాంగ్స్ లో డాన్స్ చేసి అదరగొట్టి... రైన్ సాంగ్స్ లో హీరోయిన్స్ తో రొమాన్స్ చేసి అందరినీ అలరించారు. అందుకే అప్పట్లో రైన్  డ్యాన్స్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలు రైన్ సాంగ్స్ లో హీరోయిన్స్ తో స్టెప్పులు వేసి అద్దరగొట్టిన విషయం తెలిసిందే. 

 

 

 మెగాస్టార్ చిరంజీవి ఎన్ని సినిమాల్లో రైన్ సాంగ్స్ లో డాన్సులు చేసినప్పటికీ ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుండిపోయే మాత్రం ఘరానా బుల్లోడు  సినిమాలో ఉండే  రెయిన్ సాంగ్ . సినిమాలో  మెగాస్టార్ చిరంజీవి తన డాన్స్ లతో  అదరగొట్టాడు. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు అనే పాటలో  మెగాస్టార్ చిరంజీవి అప్పటి అందాల ముద్దుగుమ్మ నగ్మా తో కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఇరగదీసిన  విషయం తెలిసిందే. ఇక ఈ పాటలో వీరిద్దరి డాన్స్ పర్ఫార్మెన్స్ లు అదరహో అనిపిస్తుంటాయి. ఒకరికి మించి ఒకరు డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఈ పాటలో ఇరగదీశారు. 

 


 ఘరానా బుల్లోడు సినిమా లో ఈ పాట ఎంతగానో ఫేమస్ అయిన  విషయం తెలిసిందే. రైన్  సాంగ్ కావాడం.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నగ్మా లు  తమదైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టడం... పాటల లిరిక్స్ కూడా అద్భుతమైన అర్థం వచ్చేలా ఉండడంతో ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది అని చెప్పాలి.ఈ పాటలో నగ్మా చిరంజీవి మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయింది. ఇక వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. చివరికి ఘరానా బుల్లోడు సినిమా నుంచి కిటుకులు తెలిసిన చిటపట చినుకులు అనే పాట మంచి హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా విజయంలో ఈ పాట కూడా ఎంతో కీలక పాత్ర పోషించేది అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: