మెగా ఫ్యామిలీ హీరోలందరూ చిరంజీవిని ఓ గురువుగా.. ఓ గైడ్ గా ఓ గాడ్ ఫాదర్ గా చూస్తారు.అయితే బన్నీ మాత్రం చిరంజీవితో పాటు సైరాను కూడా ఫాలో అవుతున్నాడు. సైరాతో చిరంజీవి ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. ఇదే తరహాలో బన్నీ పుష్ప తెరకెక్కనుంది. నటీనటుల ఎంపిక విషయంలో పుష్ప.. సైరాను కాపీ కొట్టేస్తున్నాడు.  

 

సైరా కాస్టింగ్ కోసం చిరంజీవి టీమ్ పెద్ద కసరత్తే చేసింది. సినిమాను పాన్ ఇండియాగా తీద్దామనుకున్న ఆలోచన రావడం.. సౌత్ లోని అన్ని భాషలతో పాటు.. హిందీలోని నటీనటులను కూడా తీసుకోవాలని నిర్ణయించుకుంది. సైరా నరసింహారెడ్డి గురువు పాత్రకోసం అమితాబ్ బచ్చన్ ను తీసుకున్నారు. 

 

బాహుబలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కినా.. తెలుగు, తమిళ నటులతో తీసేశాడు రాజమౌళి. బాహుబలి కంటే సైరా భారీ కాస్టింగ్ తో తెరకెక్కింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి.. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ తో పాటు.. ముగ్గురు హీరోయిన్స్ తమన్నా. నయన, అనుష్క నటించారు. పుష్ప కూడా సైరాను అనుసరిస్తూ.. చాలా భాషల నుంచి హీరోలను కవర్ చేయాలని చూస్తోంది. 

 

పుష్ప సినిమా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది. విజయ్ సేతుపతి నటిస్తున్నాడని చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసింది. బాలీవుడ్ నుంచి విలన్ ను దిగుమతి చేసుకునే పనిలో లెక్కల మాస్టారు ఉన్నాడు. అలాగే కన్నడ ఇండస్ట్రీని అక్కడి యంగ్ స్టార్ ధనుంజయతో కవర్ చేస్తారట. భైరవగీతతో నటించిన ధనుంజయకు కన్నడలో మంచి క్రేజ్ ఉంది.పాన్ ఇండియా మూవీ బడ్జెట్ ఎక్కువ కావడంతో.. తమిళ.. కన్నడ.. బాలీవుడ్ నటులతో.. అక్కడి బిజినెస్ పెంచుకోవాలన్న ఐడియాతో పుష్ప టీమ్ ఉంది. 

 

ప్లాన్ ఎ బెడిసికొట్టడంతో.. పుష్ప ప్లాన్ బిని రెడీ చేసింది. కేరళ అడవుల్లో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. కరోనా కారణంగా.. ఆంధ్రప్రదేశ్ లోని అడవుల్లోనే షూట్ చేయడానిక రెడీ అయింది. అల్లు అర్జున్ ఇందులో లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రివెంజ్ ఫార్ములాతో సుకుమార్ పుష్పను డిజైన్ చేశాడు. రష్మిక హీరోయిన్ కాగా.. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: