తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల వారసులు వచ్చినప్పటికీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంతో మంది యువ హీరోలు సైతం చెప్పుకొచ్చారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఘట్టమనేని వారసుడిగా హీరో గా పరిచయమయ్యాడు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయమైన మహేష్ బాబు ఆ తర్వాత మురారి లాంటి పలు సినిమాల్లో నటించాడు. అయితే ఈ సినిమాలు  మంచి విజయం సాధించాయి కానీ మహేష్ బాబుకు స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్ మాత్రం తీసుకురాలేకపోయాయి. కానీ 2006లో మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పే సినిమా వచ్చి టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది అనే చెప్పాలి. 

 


 టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో... స్టార్ హీరో రేంజ్ వైపు ఆసక్తిగా చూస్తున్న మహేష్ బాబు హీరోగా... అప్పట్లో జీరో సైజ్ అందాలతో అదరగొట్టిన ఇలియానా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పోకిరి. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను ఏ రేంజ్లో బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోకిరి సినిమాలో మహేష్ బాబు లుక్... సినిమా స్టోరీ.. యాక్షన్ సన్నివేశాలు అన్ని ప్రేక్షకులను తెగ ఆకర్షించాయి. దీంతో ఇది మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. 

 


 సంచలన వసూళ్లను  కూడా రాబట్టింది ఈ సినిమా. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని థియేటర్లలో వంద రోజులకు పైగానే ఆడింది. అంతేకాకుండా ఈ సినిమా టాలీవుడ్ లో  సరికొత్త ట్రెండ్ సృష్టించింది అనే చెప్పాలి. ఇండస్ట్రీ రికార్డులు మొత్తం బద్దలు కొట్టి మహేష్ బాబును  స్టార్ హీరో రేంజ్ కి తీసుకెళ్లడమే కాదు... దర్శకులు అందరిలో కూడా సరికొత్త ఆలోచన రేకెత్తించింది. పోకిరి సినిమా తర్వాత సూపర్ స్టార్  మహేష్ బాబు  వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి. అటు వెంటనే అతడు సినిమాలో నటించి మరో సంచలన విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్ బాబు. దీంతో ఒక్కసారిగా స్టార్ హీరో రేంజికి ఎదిగిన మహేష్ బాబు తన సత్తా నిరూపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: