సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ టైం లో తీసి రిలీజ్ చేసిన సినిమా క్లైమాక్స్. మియా మాల్కోవా, రెనాన్ సేవరో కలిసి నటించిన క్లైమాక్స్ ఈ సినిమాను శ్రేయాస్ ఈటి యాప్ ద్వారా పే పర్ వ్యూ ద్వారా రిలీజ్ చేశాడు ఆర్జీవీ. ఎలాంటి అడ్డంకులు ఉన్నా తాను చేయాలనుకున్న పనిని చేసి చూపించే ఆర్జీవీ క్లైమాక్స్ సినిమాతో ఆడియెన్స్ కు షాక్ ఇచ్చాడు. సినిమా అయితే తీశాడు కానీ కథ, కథనాల మీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు ఆర్జీవీ. కేవలం మియా మాల్కోవా అందాల మీదే ఫోకస్ పెట్టినట్టు ఉన్నాడు. 

 

అయినా సరే టీజర్, ట్రైలర్ లతో సినిమాలో ఏదో ఉంది అని ఆశ చూపించిన వర్మ సినిమాను చూడాలంటె 100 రూపాయలు పెట్టి చూడాలని అన్నాడు. అయితే మియా మాల్కోవా అందాలకు 100 రూపాయలు  లెక్కెం కాదు అని అందరు క్లైమాక్స్ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. కేవలం 50,000ల మంది 100 రూపాయలు చెల్లించి ఈ సినిమా చూస్తారని భావించగా ఇప్పటివరకు 2,75,000 మంది 100 రూపాయలు చెల్లించి క్లైమాక్స్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపించారు. 

 

12 గంటల వ్యవధిలో క్లైమాక్స్ సినిమాను 1,68,596 మంది చూసినట్టు  ప్రకటించారు. రెండున్నర లక్షల మంది 100 రూపాయలు చెల్లించారు అనే ఇప్పటివరకు పాతిక లక్షల పైగా వసూళ్లు వచ్చినట్టే. పే పర్ వ్యూ కాబట్టి చూడాలని అనుకున్న వారు 100 రూపాయలు చెల్లించి సినిమా చూస్తారు. క్లైమాక్స్ సినిమా బాగా లేదని టాక్ వచ్చినా సరే వసూళ్లు మాత్రం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే ఊపుతో ఆర్జీవీ నగ్నం సినిమాను కూడా రిలీజ్ చేసేలా ఉన్నాడు. ఈ లాక్ డౌన్ ఎదో ఆర్జీవీ సినిమాల విడుదలకు అవకాశంగా మారిందని చెప్పొచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: