ఎన్ఆర్ఐ బ్యూటీ పార్వతి‌మెల్టన్ ఐటమ్ సాంగ్స్ కు పెట్టింది పేరు. ఆమె ‘దూకుడు’ సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ ఎటువంటి దుమ్ము రేపిందో అందరికి తెలిసిన విషయమే. అటువంటి పార్వతి మిల్టన్ తన కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతోంది. కమల్‌హాసన్ లేటెస్ట్ మూవీ ‘ఉత్తమవిలన్’లో స్పెషల్‌సాంగ్ ఆఫర్ ఈ బ్యూటీ సొంతం చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. తొమ్మిదేళ్ల కిందట టాలీవుడ్ కొచ్చినా, సరైన ఆఫర్లు లేక ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేస్తూ కాలం గడిపేసింది హీరోయిన్ పార్వతిమెల్టన్. రెండేళ్ల కిందట మహేష్ సినిమా ‘దూకుడు’ సినిమా లో ఐటెంసాంగ్ తో తన కెరియర్ ను పూర్తిగా మార్చేసుకుంది. అయితే గత ఏడాది ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని పెళ్లి చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని మళ్ళీ యూటర్న్ తీసుకుని రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్న కమల్ ‘ఉత్తమవిలన్’ చిత్రంలో ఐటెంసాంగ్ ఆఫర్ ను కొట్టేసింది అన్నది లేటెస్ట్ న్యూస్. అదేవిధంగా పెళ్లైనంత మాత్రాన ఎక్స్‌పోజింగ్ చేయనని భావించొద్దంటూ దర్శకుడికి బూస్టింగ్ కూడా ఇచ్చిందట. ఈవిధంగా తన అభిమానులను ఆకట్టుకోవడంలోవున్న మజా మరొకటి వుండదంటూ ఉపన్యాసాలు కూడా ఇస్తోందట. కానీ ఇప్పటికే చాలామంది కొత్త ఐటమ్ గర్ల్స్ రంగ ప్రవేశం చేసిన నేపధ్యంలో పార్వతి సాహసం విజయవంతం అవుతుందా అన్నదే ప్రశ్న. 

మరింత సమాచారం తెలుసుకోండి: