మామూలుగా అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన హీరోయిన్లు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి సినిమాలో తల్లి పాత్రలను చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగినప్పటికి ఆ తర్వాత ప్రస్తుతం యువ హీరోలకు తల్లి పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇలా తల్లి పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్న  హీరోయిన్లు చాలామందే ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించి దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగి ప్రస్తుతం... యువ హీరోలకు తళ్ళి  పాత్రలు చేస్తున్న వారిలో ఒకరు టబు . 

 

 ఒకప్పుడు స్టార్ హీరోలందరి సినిమాల్లో టబు  కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన విషయం తెలిసింది తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను ఆకర్షించడమే కాదు ఎంతో క్రేజ్  కూడా సంపాదించుకుంది . ఇక ఆ తర్వాత అవకాశాలు కాస్త తగ్గడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడా కనిపించలేదు. ఇక తమ అభిమాన నటి అయిన టబు మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తే బాగుండు అని అభిమానులు కూడా ఎంతగానో కోరుకున్నారు. ఇక త్రివిక్రమ్ సినిమాలో హీరో తల్లి పాత్రలో మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ కు ఎంట్రీ  ఇచ్చింది టబు . మామూలుగానే త్రివిక్రమ్ తన సినిమాలలో హీరోహీరోయిన్ తల్లి పాత్ర కోసం సరికొత్త నటీమణులను తీసుకు వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. 

 


 ఈ క్రమంలోనే రీసెంట్ గా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలా వైకుంఠపురములో  సినిమాలో  టబుని తల్లి పాత్రలో నటించేందుకు ఒప్పించి తెలుగు చిత్ర పరిశ్రమలో నటించేలా  చేశారు. టబు అలా వైకుంఠపురం సినిమాలో  అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటించింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా అదే అందం అదే అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. పాత్రకు తగ్గట్టుగా అభినయాన్ని ప్రదర్శిస్తూ తెలుగు ప్రేక్షకులందరినీ తల్లి పాత్రలో మెప్పించింది టబు . ఇక అలా వైకుంఠపురములో సినిమాలో టబు  చెప్పిన డైలాగులు కూడా ఎంతో మందిని  ఫిదా చేశాయనే చెప్పాలి.మరి  రానున్న రోజుల్లో టబు మరిన్ని  సినిమాల్లో  నటిస్తుంది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: