క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్... ఈ పదాలపై ఎన్నో రోజుల పాటు సినీ పరిశ్రమలో చర్చలు జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మీ టు ఉద్యమం పేరుతో ఎంతో మంది సినీ తారలు తమకు ఎదురైన చేదు అనుభవాలను గురించి తెరమీదికి తెచ్చి సంచలనాలు సృష్టించారు. ఎంతో మంది యువ హీరోయిన్లు కూడా సినిమాల్లో అవకాశాలు రావాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా మరో నటి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఐస్క్రీం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై... ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ పాత్రల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించిన నటి తేజస్వి. అయితే ఈ అమ్మడు చేసిన సినిమాలలో బాగానే గుర్తింపు సంపాదించినప్పటికీ అమ్మడుకు అవకాశాలు మాత్రం అంతగా రాలేదు.

 


 అయితే తాజాగా కమిట్మెంట్ గురించి ఈ అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేసింది. చిత్ర పరిశ్రమలో  అసభ్యమైన ప్రవర్తనతో నరకం చూపించే వాళ్ళు  చాలా మంది ఉంటారు అంటూ చెప్పి  అందరికీ షాక్ ఇచ్చింది. తనను  కూడా చాలామంది కమిట్మెంట్ అడిగారు అంటూ చెప్పి కుండలు బద్దలు కొట్టేసింది ఈ అమ్మడు. పడుకోనిదె  పనులు జరగవు అంటూ ఓపెన్ గా  చెప్పేసింది. ఇలా కమిట్మెంట్ ఇవ్వకపోవడం కారణంగా తాను ఎన్నో సినిమాలను దూరం చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. సినిమా ఇండస్ట్రీ కి రావాలంటే కమిట్ మెంట్ కు సిద్ధమైన తర్వాతే రావాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతిభ ఉండటం కంటే కమిట్మెంట్ ఉండడం ఎంతో ముఖ్యం అంటూ తెలిపింది.

 


 బాంబే నుంచి వచ్చే హీరోయిన్స్ కమిట్మెంట్ కి  సిద్ధ పడతారు కాబట్టి ఎక్కువగా అలాంటి హీరోయిన్లకే ఛాన్సులు ఇస్తారని సంచలన ఆరోపణలు చేసింది తేజస్వి. బాలీవుడ్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ అలా కమిట్మెంటు ఇచ్చేవాళ్ళు ఉంటారు అన్నది తన ఉద్దేశం కాదని.. కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఒకానొక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ ద్వారా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రేమించి  పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రియుడు.. తాను  సినిమా ఇండస్ట్రీ అని తెలిసిన తర్వాత నన్ను అనుమానంతో వదిలేసాడు అంటూ తెలిపింది.ఇక గతంలో తనకు బాలీవుడ్లో వెబ్ సిరీస్ లో  కూడా ఆఫర్లు వచ్చాయని.. కానీ నగ్నంగా నటించాలని కోరడంతో తాను ఆ ఆఫర్ను తిరస్కరించాను అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా తేజస్వి నటిస్తున్న కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: