యువ హీరో నాగ శౌర్య నటించిన అశ్వద్ధామ సినిమా.. తన కెరియర్ లో ఫస్ట్ మాస్ అండ్ యాక్షన్ కమర్షియల్ మూవీగా వచ్చింది. నాగ శౌర్య, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన ఈ సినిమాను రమణ తేజ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే నాగ శౌర్య అందించడం విశేషం. సినిమా వెండితెర బాక్సాఫీస్ ఫైట్ లో యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ ఇయర్ జనవరి ఎండింగ్ లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయి అంచనాలను అందుకోలేదు. 

 

అయితే మే 15న జెమిని టివిలో ప్రీమియర్ షో వేయగా నాగ శౌర్య అశ్వద్ధామ సినిమాకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంత్వరకు తన కెరియర్ లో ఇన్ని సినిమాలు స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ కాగా ఈ సినిమాకె హయ్యెస్ట్ గా 9.10 టి.ఆర్.పి రేటింగ్స్ రావడం విశేషం. స్మాల్ స్క్రీన్ పై అశ్వద్ధామకు వచ్చిన ఈ రెస్పాన్స్ చూసి నాగ శౌర్య కూడా సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వారు పడిన కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందని భావించారు.

 

యువ హీరోగా ఒక హిట్టు రెండు ఫ్లాపులుగా నాగ శౌర్య కెరియర్ సాగుతుంది. అశ్వద్ధామ సినిమా నాగ శౌర్య చాలా ప్రెస్టిజియస్ గా తీసుకున్నాడు. అయితే సిల్వర్ స్క్రీన్ పై ఆ సినిమా మ్యాజిక్ క్రియేట్ చేయడంలో విఫలమైంది. అయితే స్మాల్ స్క్రీన్ పై మాత్రం అశ్వద్ధామ తన బలాన్ని చటింది. మంచి లాక్ డౌన్ టైం లో సినిమా బుల్లితెరలో రిలీజ్ కావడం కూడా ఈ రేంజ్ లో టి.ఆర్.పి తెచ్చుకోడానికి దోహద పడ్డదని చెప్పొచ్చు. మొత్తానికి థియేటర్ లో హిట్ అవని కొన్ని సినిమాలు బుల్లితెర మీద మాత్రం అద్భుతాలు సృష్టిస్తున్నాయి.            

మరింత సమాచారం తెలుసుకోండి: