టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముందుగా పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా తన స్నేహితులతో కలిసి డిస్ట్రిబ్యూషన్ చేసి మంచి లాభాలు అందుకున్న రాజు, ఆ తరువాత నితిన్ హీరోగా అప్పట్లో వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ సినిమాతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థను స్థాపించి నిర్మాతగా మారారు. అయితే తీసిన ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకున్న రాజుకు ఆ తరువాత నుండి దిల్ రాజుగా పేరు స్థిరపడిపోయింది. ఇక ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలు నిర్మించిన దిల్ రాజు మంచి హిట్స్ తో పాటు మధ్యలో కొన్ని ఫ్లాప్స్ కూడా అందుకోవడం జరిగింది. 

IHG': S Thaman says composing <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MUSIC' target='_blank' title='music- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>music</a> for the <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PAWAN' target='_blank' title='pawan- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>pawan</a> Kalyan ...

ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు కు ఒక నిర్మాతగా వ్యవహరించిన రాజు, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న వకీల్ సాబ్ సినిమాని నిర్మిస్తున్నారు. తన అభిమాన నటుడు పవన్ తో తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత శ్రద్ధ పెట్టిన రాజు, సినిమా ఎలాగైనా మంచి హిట్ సాధించేలా యూనిట్ కి మంచి మార్గదర్శకులుగా నిలుస్తున్నట్లు సమాచారం. ఇక గత కొద్దిరోజులుగా కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో వకీల్ సాబ్ షూటింగ్ కూడా మిగతా సినిమాల మాదిరిగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇక ఇటీవల రెండు రాష్ట్రాల నుండి సినిమాల షూటింగ్స్ కు అనుమతులు లభించడంతో అతి త్వరలో వకీల్ సాబ్ మిగిలిన షూట్ ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా ప్రారంభించి, వేగంగా ముగించి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. 

 

అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం మరోవైపు ఈ సినిమా విషయమై తెగ ఆందోళన చెందుతున్నారు. తమ హీరోని తెరపై చూసి దాదాపుగా రెండేళ్లకు పైగా అవుతుండడంతో ఎప్పుడెప్పుడు వకీల్ సాబ్ ద్వారా ఆయనని తెరపై చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో, సినిమా అసలు ఈ ఏడాది రిలీజ్ అవుతుందో లేదో అని, మొత్తంగా నిర్మాత దిల్ రాజు గారే తమకు దిక్కని, ఆయన గట్టిగా పూనుకుని ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని వారు పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మెసేజెస్ చేస్తూ కోరుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: