చిరంజీవి, మొహన్ బాబులు బయట ఒకరి ఫై ఒకరు ప్రేమ ఒలక పోస్తూ కెమెరాలకు పోజులు ఇచ్చినా వారిద్దరి మధ్య ఉన్న వైరుధ్యాలు అందరికి తెలిసినవే. కానీ అటువంటి మోహన్ బాబు చిరంజీవి నటించిన సినిమాలోని ఒక సూపర్ హిట్ సాంగ్ పై మనసు పారేసుకున్నాడు.  రీమిక్స్ సాంగ్స్ సంస్కృతి మ‌న‌కు అల‌వాటే. ఒక సినిమాలో హిట్టయిన పాట‌ని తీసుకొని మ‌రో సినిమాలో దాన్ని మిక్స్ చేసి స‌రికొత్తగా వినిపిస్తుంటారు. ఆ ప్రయ‌త్నంతో కొన్ని పాట‌లు కొన్ని సినిమాలకు విజయాలను ఇస్తే మరికొన్ని పాటలు కొన్ని సినిమాలకు పరాజయాలను ఇచ్చాయి. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా మన నిర్మాతలు మాత్రం తమ సినిమాలకు విజయం సాదించాలని తమ సినిమాకోసం ఏదో ఒక పాట‌ని రీమిక్స్ చేసి చూపిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా చిరంజీవి సినిమాలోని ఓ పాట‌ని మోహ‌న్‌బాబు సినిమాకోసం రీమిక్స్ చేయ‌బోతున్నారు. అందాల‌లో మ‌హోద‌యం... అంటూ చిరంజీవి శ్రీదేవితో క‌లిసి `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సినిమాలో లో చేసిన హడావిడి అందరికి తెలిసిన విషయమే . ఇప్పుడు ఆ పాట‌ని మ‌రోసారి రీ మిక్స్ చేస్తున్నారు. డైలాగ్‌కింగ్ మోహ‌న్‌బాబు. ప్రస్తుతం `య‌మ‌లీల 2` సినిమాలో న‌టిస్తున్నాడు అన్నవిసయం తెలిసిందే.  అందులో `అందాల‌లో మ‌హోద‌యం... ` అనే పాట‌ని రీమిక్స్ చేసి చిత్రీకరించ బోతున్నట్లుస‌మాచారం. ఈ పాటను మోహ‌న్‌బాబు, స‌దాల‌పై తీస్తారట ఏమైనా చిరంజీవిని వ్యతిరేకించే మోహన్ బాబు చిరు పాట ఫై మోజు పడటం టాలీవుడ్ లో సంచలనమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: