క్రమశిక్షణకు మారుపేరుగా నందమూరి తారక రామారావు ని చూస్తారు. అటువంటి నందమురికి నట వారసుడిగా వచ్చిన బాలయ్యకు కూడా తన తండ్రి లక్షణాలు వచ్చాయి అని చాలామంది అంటారు . అటువంటి బాలయ్య తన ఏకైక కొడుకు మోక్షజ్ఞను ‘లెజెండ్’ సినిమా సెట్స్ ఫై చూసిన ప్రవర్తనను అందరికి ఆశ్చర్యం కలిగించే విధంగా దర్శకుడు బోయపాటి నిన్న ఒక చానెల్ లో ప్రసారం అయిన ఇంటర్వ్యూ లో వివరించాడు.
హీరోగారి కొడుకు సెట్లోకి అడుగు పెడుతున్నాడంటే... అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. సినిమా సెట్స్ ఫై కి హీరో కొడుకు రాగానే అతడికి సేవలు చేయడానికి మరో నలుగురు అక్కడికి చేరుతూ ఉంటారు. అంతే కాదు ఆ బాబు ఏం అడిగితే అది క్షణాల్లో తెచ్చిపెడతారు. మొత్తంగా అతన్ని ఒక యువరాజులాగా చూసుకొంటుంటారు. కానీ బాలకృష్ణ మాత్రం అందుకు భిన్నంగా లెజెండ్ సెట్స్ ఫై నడుచుకున్నాడట.
అంతే కాదు తన కొడుకుని సెట్లో ఓ బాయ్‌లాగా మార్చేశాడట. చిత్రబృందానికి స్వయానా కొడుకు చేత టీలు ఇప్పించాడట. అంతేకాదు లైట్మెన్లా మార్చేసి ట్రాలీ తోయించాడట `పడిపోతాను డాడీ` అంటే... `ఏం ఫర్లేదు... దెబ్బలు తగిలితే ఏం కాదు, తోసేయ్` అన్నాడట బాలయ్య. ఆయన కొడుకేమిటీ? ఇన్ని పనులు చేయించడమేమిటీ అనుకోకండి అదే మరి బాలయ్య స్పెషాలిటీ అంటున్నాడు బోయపాటి. రేపో మాపో కాబోయే హీరోనే అయినా... మోక్షజ్ఞకి సెట్లో అన్ని విషయాలూ తెలియాలనేది బాలకృష్ణ ఆలోచనట.
టీ అందించే బాయ్ కష్టమేంటి? లైట్‌మెన్ ఎంత శ్రమిస్తాడు? సహాయ దర్శకుడు ఏమేం పనులు చేస్తాడు? ఇలాంటివన్నీ తెలుసుకొంటేనే పైకి వస్తావు అంటూ బాలయ్య తన కొడుకుకు లెజెండ్ సెట్స్ ఫై క్లాసులు పీకాడని బోయపాటి బాలయ్యలోని తండ్రి భాద్యత కోణాన్ని బుల్లి తెర ఫై వివరించాడు .
మరింత సమాచారం తెలుసుకోండి: