మహానటి... ఈ తరం చూసిన అందమైన సినిమాల్లో ఒకటి. ఈ తరం చూసిన ఒక గొప్ప నటి కీర్తి సురేష్. అవును కీర్తి సురేష్ ఆ సినిమాలో చేసిన నటన చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఆమె నటన ఆమె పోషించిన పాత్ర గాని అన్నీ కూడా ఒక సంచలనం. ఏ మాటకు ఆ మాట ఆ విధమైన పాత్ర పోషించాలి అంటే నిజంగా ధైర్యం కావాలి. ఆమె అదే ధైర్యం తో ఆ పాత్రను పోషించింది. ఆ పాత్రలో ఆమె జీవించింది అని సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. ఆమె మినహా ఎవరూ కూడా చేయలేరు అంటూ సినిమా చూసిన తర్వాత చెప్పారు చాలా మంది. 

 

ఇక ఆ సినిమాలో ఆమె... జెమిని గణేషన్ కి భార్య గా నటించారు. నిజ జీవితంలో కూడా అదే... ఇక సావిత్రి పాత్రలో ఆమె చాలా అందంగా కనిపించారు అని చెప్తారు చాలా మంది. దుల్కర్ సల్మాన్, కీర్తి కాంబినేషన్ చాలా బాగుంది. వారు ఇద్దరూ భార్యా భర్తలు గా చాలా అందంగా నటించడమే కాదు నటన తో మైమరిపించారు. ఆ సినిమా తర్వాత కీర్తి సురేష్ కి డిమాండ్ కూడా బాగా పెరిగింది అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత ఆమె కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆమె ఏ స్థాయిలో ప్రభావం చూపించింది అనేది అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇక ఇప్పుడు ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. కథ లో ప్రాధాన్యత ఉంది అంటే మాత్రం ఆమెను కచ్చితంగా సినిమాలో ఎంపిక చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆమె ఇప్పుడు రెండు మూడు సినిమాలు చేస్తుంది. ఈ రెండు మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది రానున్నాయి. ఓటీటీ లో కూడా విడుదల చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: