టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా తన చిన్నతనంలో బాలరామాయణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నందమూరి మూడవ తరం వారసుడు ఎన్టీఆర్, చిన్న వయసులోనే సినిమాలో తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఇక ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని పెరిగి పెద్దయ్యాక నిన్ను చూడాలని సినిమాతో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ పరిచయం అవడం జరిగింది. అనంతరం స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి ఇలా తన కెరీర్ బిగినింగ్ లోనే మంచి మాస్ హిట్స్ కొట్టిన ఎన్టీఆర్, చిన్నతనంలోనే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఇక సినిమా రంగప్రవేశం తరువాత హీరోగా నటించిన సినిమాల్లోని పలు సాంగ్స్ లో డ్యాన్స్ లు అదరగొట్టేవాడు. 

IHG

మొదటి సినిమా నుండి దాదాపుగా ప్రతి ఒక్క సినిమాలో కూడా తనదైన ఆకట్టుకునే డ్యాన్స్ మూమెంట్స్ ప్రదర్శిస్తూ ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని అలరిస్తూ ముందుకు సాగుతున్నారు ఎన్టీఆర్. ఇక ఇటీవల వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ కెరీర్ హిట్స్ లో ఒక మంచి హిట్ గా నిలిచిన నాన్నకు ప్రేమతో సినిమాలోని కొన్ని సాంగ్స్ కు ఆయన అదిరిపోయే డ్యాన్స్ లు చేయడం జరిగింది. 

 

మరీ ముఖ్యంగా ఆ సినిమా చివరిలో వచ్చే సాంగ్ అయిన లవ్ దెబ్బ సాంగ్ లో ఎన్టీఆర్ వేసే స్టెప్పులు నిజంగా ఆడియన్స్ ని కళ్ళు తిప్పుకోనివ్వవు అనే చెప్పాలి. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన మంచి మాస్ బీట్ సాంగ్ కు ఎన్టీఆర్, రకుల్ జోడి స్క్రీన్ పై అదరగొట్టడం ఒక ఆకర్షణ అయితే, ఎన్టీఆర్ విభిన్నమైన డ్యాన్స్ మూమెంట్స్ మరొక అదనపు ఆకర్షణ. ఇప్పటికీ కూడా ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి ఆదరణతో కొనసాగుతోంది. ఆ విధంగా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ డ్యాన్స్ మూమెంట్స్ ఉన్న సాంగ్స్ లో లవ్ దెబ్బ సాంగ్ కూడా ఒకటి అనే చెప్పకతప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: