హీరోయిన్ అమలాపాల్ పెళ్ళి విషయాలు గత కొద్ది కాలంగా మీడియాకు హాట్ టాపిక్ అయ్యాయి. అమల తమిళ దర్శకుడు విజయ్‌ని త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని కోలీవుడ్ మీడియా తెగ రాతలు రాస్తున్న నేపధ్యంలో ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది హీరోయిన్ అమలాపాల్.
ఈ సందర్భంగా ఓ ప్రెస్‌నోట్ ను కూడ విడుదల చేసింది. షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం విజయ్ విదేశాల్లో వున్నాడు. చెన్నై రాగానే తాము ఇరువురం భవిష్యత్‌పై ఓ క్లారిటీ ఇస్తామని పేర్కొంది. ఇదిలావుండగా విజయ్ - అమలాపాల్ జూన్ 12న మ్యారేజ్ చేసుకోవాలని ముహూర్తం కూడా పెట్టేసుకున్నట్లు కోలీవుడ్ మీడియా ఇన్‌సైడ్ టాక్.
అంతేకాకుండా వారి మ్యారేజ్ కు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారం కూడా వచ్చిన్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలాపాల్ పెళ్లి పనుల్లో బిజీగా వుందట. ‘మదరాసుపట్టణం’తో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దర్శకుడు విజయ్. ఈ మూవీ తర్వాత తమిళస్టార్ విజయ్‌తో గతేడాది ‘తలైవార్’ చేశాడు. ఇందులో అమలాపాల్ హీరోయిన్.
ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే విజయ్- అమలాపాల్ మధ్య స్నేహం ప్రేమగా మారిందని టాక్. ప్రస్తుతం సినిమాలు లేక బాధ పడుతున్న అమలపాల్ ఇక సినిమాలు గురించి ఆలోచించి బుర్ర పాడుచేసుకోకుండా చక్కగా పెళ్లి పీటలు ఎక్కుతోంది అనుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి