కొన్ని సినిమాల్లో హీరో పాత్రలకు ధీటు గా హీరోయిన్ల పాత్రలు ఉంటాయి. అవి ప్రేమకథలైతే హీరో హీరోయిన్ల తల్లిదండ్రుల పాత్రలు కొన్నిసార్లు శక్తివంతంగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో వెంకటేష్ -ఆర్తి అగర్వాల్  నటించిన నువ్వు నాకు నచ్చావ్. సినిమా ఒకటి. ఈ సినిమా లో హీరో హీరోయిన్ల ప్రేమకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ తన తండ్రి ప్రకాశ్ రాజ్ మధ్య ఆప్యాయత కూడా అంతే శక్తివంతంగా ఉంటుంది. సినిమాలోని పాత్రలను అంత అందంగా చూపించారు. ఆ సినిమా మొత్తానికి ఆయన  నటన అద్బుతమనే చెప్పాలి. 

 


తండ్రి ,కూతుళ్ల మధ్య ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అదే ఈ సినిమా లో మెయిన్ పాయింట్ గా తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి కూతురు అడిగింది కాదనకుండా సమకూర్చే పాత్రలో ప్రకాశ్ రాజ్ పాత్ర ఉంటుంది. కూతురు పెళ్లి చేసుకుని తనకు దూరమైపోతుందని బాధ పడుతూ ఉంటాడు ప్రకాశ్ రాజ్. కూతురు మనసుకు నచ్చిన వాడు కాకుండా తనకు ఇష్టమైన వ్యక్తే ఉండాలని చూసే తండ్రి పాత్ర లో ప్రకాశ్ రాజ్ నటించాడు.

 

 

తర్వాత తన ఫ్రెండ్ కొడుకు వెంకటేష్ వ్యక్తిత్వం తనకు నచ్చడం తో పాటుగా అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి పెళ్ళికి ముందే ఎవరితోనో తిరుగుతుంది అని నింద  వేస్తె అది నిజం కాదు అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంటూ వెంకటేష్ వారిని బ్రతిమలాడటం ఇవన్నీ కూడా ప్రకాశ్ రాజ్ కు నచ్చడం తో వెంకీకి తన కూతురుని ఇస్తే సంతోషంగా ఉంటుందని భావించి చివరికి ఇద్దరినీ కలుపుతాడు. అలా కూతురి మీద ప్రేమ ఉన్న చివరికి తన సంతోషాన్ని తనకివ్వడం లో అతను పడే ఆవేదన సినిమాకు హైలెట్ గా నిలిచాయి. దీంతో సినిమా సూపర్ హిట్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: