ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ అరవింద సమేత వీర రాఘవ వచ్చి రెండేళ్లే అయింది గానీ.. పదేళ్ల నుంచి ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. తారక్ త్రివిక్రమ్ ను స్వామీ.. అని ఆప్యాయంగా పిలుస్తాడు. తారక్ కొడుకులతో త్రివిక్రమ్ ది మామ్యయ మేనల్లుళ్ల బంధం. 

 

అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత బన్నీతో తీసిన అల వైకుంఠపురములో 150కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. అల సక్సెస్ తర్వాత మరోసారి ఎన్టీఆర్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. 

 

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్నాడు. బాహుబలి 2మాదిరి ఆర్ఆర్ఆర్ సౌత్ ఇండియాలోని లాంగ్వేజస్ తో పాటు.. హందీలో రిలీజ్ అవుతోంది. ఈ పాన్ ఇండియా ఇమేజ్ ను త్రివిక్రమ్ అడ్డుకుంటున్నాడా.. అనిపిస్తోంది. ఎందుకంటే.. త్రివిక్రమ్ తీసిన సినిమాలన్నీ టాలీవుడ్ కే పరిమితమయ్యాయి. 

 

ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి వస్తుంది. తారక్ ఒకసారి పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన తర్వాత మళ్లీ ఓన్లీ తెలుగు సినిమా అంటే కష్టం. ఇమేజ్ ను తగ్గించుకున్నట్టే అవుతుంది. మరి త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ తీస్తాడా లేదా అనే డౌట్ ఫ్యాన్స్ ను ఆలోచనలో పడేసింది. 

 

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ ను కాకుండా మరో ఇద్దరు దర్శకులను లైన్ లో పెట్టాడు. తమిళ దర్శకుడు ఓన్లీ.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటిస్తాడన్న న్యూస్ చాలాకాలంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరి సినిమాలు పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఈ లెక్కన త్రివిక్రమ్ సినిమా ఒక్కటే లోకల్ మూవీగా మిగిలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: