ప్రపంచ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయని సాహసం చేస్తూ రామ్ గోపాల్ వర్మ తన పవన్ స్టార్ మూవీ ట్రైలర్ ను చూడటానికి కూడ టిక్కెట్ పెట్టి ఒక పెను సంచలనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో తన ప్రయత్నాలకు మరింత పబ్లిసిటీ రావడానికి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాను టార్గెట్ చేయడం  రాజమౌళిని ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. 


వాస్తవానికి ఇలా టార్గెట్ చేయడం ద్వారా తన కామెంట్స్ పై అందరి దృష్టి పడుతుందని తద్వారా తన పవర్ స్టార్ మూవీకి మరింత క్రేజ్ ఏర్పడుతుందని వర్మ వ్యూహం. ఈవ్యూహంలో భాగంగా వర్మ రాజమౌళికి మరొక ఉచిత సలహా ఇచ్చాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఈసినిమాకు ఆర్ధిక సమస్యలు లేకుండా ఉండాలి అంటే తన పవర్ స్టార్ మూవీలానే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ట్రైలర్ ను కూడా టిక్కెట్ పెట్టి విడుదల చేస్తే వందల కోట్లు వస్తాయని అంటూ వర్మ ఒకసలహా రాజమౌళికి ఇస్తున్నాడు. 


దీనితో వర్మ అన్నమాటలను బట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు ఎంత విలువ ఉందో ఆసినిమా ట్రయిలర్ కు కూడా అంతే విలువ ఉంటుంది అన్నఅభిప్రాయంతో వర్మ ఈకామెంట్ చేసాడా లేదంటే తన పవర్ స్టార్ మూవీ కూడ రాజమౌళి సినిమాల స్థాయి రేంజ్ కి తగ్గది అన్న సంకేతాలు ఇవ్వడానికి ఇలా వర్మ కామెంట్ చేసాడా అన్నవిషయం పై ఇప్పుడు అనేక చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పరోక్షంగా వర్మ రాజమౌళికి ఉచిత సలహాలు ఇస్తూనే ఉన్నాడు. 


రాజమౌళి ఆలోచనల ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ ట్రైలర్ కు 150 రూపాయల టిక్కెట్ పెడితే ఆమూవీ ట్రైలర్ కు వచ్చే డబ్బుతో ‘ఆర్ ఆర్ ఆర్’ తీయవచ్చు అన్నఅభిప్రాయం వర్మ సూచనలో కనిపిస్తుంది. అదేవిధంగా రేపు విడుదల అవుతున్న తన పవర్ స్టార్ ట్రైలర్ కు కూడ 25 రూపాయల టిక్కెట్ పెట్టిన పరిస్థితులలో తన ఆలోచనలు కూడ రాజమౌళి స్థాయిలో ఉన్నాయి అన్నసంకేతాలు ఇవ్వడానికే ఇలా వర్మ కామెంట్ చేసి ఉంటాడు అని అంటున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: