లావణ్య త్రిపాఠి.. ఈ పేరు పరిచయాలు అవసరం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. మొదటి సినిమాతోనే యూత్‌ను ఆకర్షించింది.

ఆ తరవాత భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, అర్జున్ సురవరం వంటి మంచి చిత్రాలతో ఆడియన్స్‌కి బాగా దగ్గరైపోయింది ఈ సొట్టబుగ్గల చిన్నది.

ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో ఒక సినిమా చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన లావణ్య త్రిపాఠి పార్ట్నర్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అయితే పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్ కాదండోయ్.. తనపెంపుడు శునకం.

ఇప్పటికే మాస్కులు వంటివి ఇంట్లో తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసినIHG.. మిగతా సమయాల్లో తన శునకంతో ఫుల్లుగా టైమ్ పాస్ చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.







క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి