యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 1 మూవీకి కొనసాగింపుగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా కెజిఎఫ్ చాప్టర్ 2. రెండేళ్ల క్రితం కేవలం కన్నడకు మాత్రమే పరిమితం చేద్దామనుకున్న ఈ సినిమాని చూసిన దర్శకదిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి, దానిని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయమని చెప్పడం, ఆయన సూచనతో కెజిఎఫ్ చాప్టర్ 1 ని మన దేశంలోని పలు భాషల్లో రిలీజ్ చేసిన సినిమా యూనిట్, అన్ని భాషల్లో కూడా ఆ సినిమా గొప్ప విజయాన్ని అందుకోవడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. 

IHG

దానితో ప్రస్తుతం తెరకెక్కుతున్న చాప్టర్ 2 పై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగాయి. చాప్టర్ 1 లో విలన్ అయిన గరుడ, సినిమా క్లైమాక్స్ లో చంపడడంతో, కెజిఎఫ్ ని ఆక్రమించుకోవాలని పలువురు కుట్రపన్నుతారు. అయితే వారిలో ముఖ్యుడు అధీరా. అన్న సూర్యవర్ధన్ మరణాంతరం కెజిఎఫ్ ని మొదట్లోనే తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తాడు అధీరా, కానీ సడన్ గా అన్న కొడుకు గరుడ ప్రవేశంతో అతడు ప్రక్కకు తప్పుకుంటాడు. 

 

ఇక గరుడ మరణించాడని తెలియడంతో అధీరా ప్రవేశం, ఆ తరువాత కేజేఎఫ్ ని అతడు స్వాధీన పరుచుకున్నాడా లేదా, మధ్యలో రాఖీ, అతడికి ఎలా అడ్డు తగిలాడు వంటి అంశాలతో ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ రెండవ భాగాన్ని మరింత భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాడు. ఇక సినిమాలో రాఖీకి, అధీరా కు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలకు థియేటర్స్ లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అని టాక్. రేపు ఉదయం అధీరా ఫిస్ట్ లుక్ అఫీషియల్ గా రిలీజ్ కానుంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అధీరాగా నటిస్తున్న ఈ సినిమ మిగిలిన షూటింగ్ ని అతి త్వరలో ముగించి, అనుకున్న విధంగా దసరా కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తుందట సినిమా యూనిట్.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: