టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందిన భద్ర సినిమా తో దర్శకుడిగా పరిచయమయ్యాడు బోయపాటి శ్రీను. దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ఆ విధంగా ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న బోయపాటి, ఆ తరువాత విక్టరీ వెంకటేష్ తో తీసిన తులసి తో మరొక హిట్ అందుకున్నాడు. అనంతరం బాలయ్యతో తీసిన సింహతో మరింత పెద్ద విజయాన్ని అందుకున్న బోయపాటికి టాలీవుడ్ లో మాస్ దర్శకుడిగా మంచి పేరు దక్కింది. 

 

ఇక తన కెరీర్ లో హిట్స్ తో పాటు దమ్ము, వినయ విధేయ రామ వంటి భారీ ఫ్లాప్స్ కూడా చవి చూసిన బోయపాటి, ప్రస్తుతం బాలయ్యతో తీస్తున్న లేటెస్ట్ సినిమాకు సంబంధించి మరింత కేర్ తీసుకుంటున్నట్లు టాక్. ఇటీవల రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్ టీజర్, ప్రేక్షకాభిమానుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది. అతి త్వరలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనబడనున్నట్లు టాక్. అందులో ఒక పాత్రలో బాలయ్య అఘోరగా కనిపించనున్నట్లు సమాచారం. వాస్తవానికి గతంలో బాలయ్య, బోయపాటిల కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఒకదానిని మించి మరొకటి అద్భుత విజయాలు అందుకోవడంతో, వీరిద్దరి హ్యాట్రిక్ మూవీ అయిన ప్రస్తుత సినిమాపై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. 

 

ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలతో వరుసగా బాలయ్య, అలానే వినయ విధేయ రామ సినిమాతో బోయపాటి, ఇద్దరూ కూడా ఫ్లాప్స్ లో ఉండడంతో, వీరిద్దరికీ ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమా సక్సెస్ ఎంతో అవసరం. దానితో బోయపాటి ఈ సినిమా స్క్రిప్ట్ పై మరింతగా శ్రద్ధ పెట్టినట్లు చెప్తున్నారు. బొమ్మంతా బోయపాటి చేతుల్లోనే ఉందని మరోవైపు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆయననే నమ్ముకున్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: