బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ ఈ కాంబినేషన్ లో సినిమా అంటే నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. మూస సినిమాలు చేస్తూ కెరియర్ లో వెనకపడిన బాలయ్య బాబుకి సింహా లాంటి సూపర్ హిట్ ఇచ్చి నందమూరి ఫ్యాన్స్ కు ఫుల్ ఎనర్జీ ఇచ్చాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన లెజెండ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. రెండు సినిమాలు కలిసి చేసి ఆ రెండిటితో హిట్ అందుకోవడంతో ఇప్పుడు వారు కలిసి చేస్తున్న మూడవ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి.    

టైటిల్ ఇంకా కన్ఫాం కాని ఈ సినిమా నుండి BB-3 అంటూ వచ్చిన టీజర్ సినిమాపై ఓ రేంజ్ బజ్ ఏర్పడేలా చేశాయి. పంచెకట్టుతో బాలయ్య లుక్కు ఫ్యాన్స్ కు కిక్కు ఇచ్చేలా చేసింది. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో ఓ యువ హీరో కూడా నటించే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. బాలకృష్ణ సినిమాలో ఈ పాత్రలో కళ్యాణ్ రాం, నాగ శౌర్య, బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ముగ్గురిలో ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.    

పాత్ర చిన్నదైనా పెద్దదైనా అనుకుంటున్న ఆ పాత్రకు కళ్యాణ్ రామ్ అయితే కచ్చితంగా సినిమాపై మరింత క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అసలే బోయపాటి శ్రీను అందులోనూ సర్ ప్రైజ్ రోల్ అంటున్నాడు. తప్పకుండా నందమూరి ఫ్యాన్స్ కు మరోసారి పండుగ లాంటి సినిమా అందించే ప్రయత్నంలో ఉన్నాడు డైరక్టర్. మరి BB3లో ఆ యువ హీరో పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని త్వరలో వెళ్ళడిస్తారు. సినిమాలో ఒక హీరోయిన్ గా అంజలి నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా స్నేహాని ఫైనల్ చేశారట.  



Powered by Froala Editor

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: