తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ జూనియర్ నందమూరి తారక రాముడికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి అభిమానులే కాదు ఇతర హీరోల అభిమానులు సైతం ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోతారు... ఎన్టీఆర్ అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ కి మెస్మరైజ్  అయిపోతారు... ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి  తాతకు తగ్గ మనవడిగా.. నందమూరి ఫ్యామిలీ కి అసలైన సిసలైన వారసుడిగా నిలదొక్కుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అందుకే నందమూరి అభిమానుల్లో  జూనియర్ ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.



ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కొంతమంది స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి ని వివాహం చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ముందుగా తన ప్రయారిటీ మొత్తం కుటుంబానికి అని చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కుటుంబం విషయంలో ఎంతో  ఎమోషనల్ గా ఉంటారు. అదే సమయంలో అభిమానులను  కూడా ఎంతో ప్రేమిస్తూ ఉంటారు, ఇక లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ జంట.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటుంది. ఇక వీరిద్దరి సీక్రెట్స్  తెలుసుకోవడానికి నెటిజన్లు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సమయంలో తన భార్య గురించి ఒక సీక్రెట్ తెలుసుకోవాలని ఉంది అంటూ ఏకంగా  జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.



ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ తెలుసుకోవాలనుకుంటున్న ఆ సీక్రెట్ ఏమిటి అనే కదా మీ డౌట్...  ఒకప్పుడు మా అబ్బాయి షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్లగానే ఎంతో ప్రేమగా తన దగ్గరికి వచ్చే వాడిని.. కానీ ఇప్పుడు మాత్రం తన తల్లి దగ్గరే ఉండి పోతున్నాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. అందుకే నేను లేని సమయంలో తన  కొడుకుని తన భార్య ఏం చెప్పి మారుస్తుంది అన్న విషయం తెలుసుకోవాలి ఉంది   అంటూ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ చేశాడు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: