లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మీదున్న గౌరవంతో.. ఎల్వీ ప్రసాద్.. మద్రాస్‌లో వున్న తన స్టూడియోలో ఓ గదిని వాడుకునేందుకు కానుకగా ఇచ్చారు. మాస్ట్రో 40 ఏళ్ల నుంచి అక్కడే మ్యూజిక్ కంపోజ్ చేస్తూ వచ్చారు. ఎల్వీ ప్రసాద్ వారసుడు రమేశ్ ప్రసాద్ కూడా... ఆ గది విషయంలో ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. అయితే.. ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ మాత్రం ససేమిరా అన్నాడు. ఇన్నాళ్లూ వాడుకున్నది చాలు.. స్టూడియో ఖాళీ చేసి వెళ్లాల్సిందేనని ఇళయరాజాపై ఒత్తిడి చేశారు.
స్టూడియో ఖాళీ చేయాలని సాయిప్రసాద్.. తనదేనని ఇళయరాజా . ఈ వివాదం కొన్ని సంవత్సరాలుగా కోర్టులో ఉంది. రీసెంట్‌గా స్టూడియోలో ఉన్న తన వస్తువలన్నింటినీ.. ధ్వంసం చేసి .. తమను దౌర్జన్యంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇళయరాజా.. సాయిప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సాయి ప్రసాద్ వాదన మరోలా ఉంది. ఇళయరాజాకు ఈ స్థలాన్ని కొతంకాలం స్టూడియో నడుపుకునేందుకు మాత్రమే ఇచ్చారని, పూర్తిగా తనకే రాసివ్వలేదని ఆయన చెబుతున్నారు. ఖాళీ చేయాల్సిందేనని సాయి ప్రసాద్ వాదిస్తున్నారు.
ఇటీవల ఇళయరాజా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తన అనుమతి లేకుండా స్టేజ్ మీద పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నోటీసులు ఇవ్వటం ఆ మధ్య చర్చనీయాంశం అయ్యింది. తన పాటలు పాడుకుంటే రాయల్టీ ఇవ్వాల్సిందేనని హెచ్చరించారు. లేటెస్ట్‌గా మరో వివాదం ఇళయరాజాను చుట్టుముట్టింది. మొత్తానికి స్టూడియో వివాదంలో ఇళయ రాజా తర్జభర్జన పడుతున్నారు. చూద్దాం.. ఈ గొడవ ఎంత వరకు దారితీస్తుందో..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి