విలక్షణ నటుడు సూర్య నటించిన తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అవుతున్నాయోగానీ... డైరెక్ట్‌గా తెలుగు మూవీలో ఇంతవరకు నటించలేదు. తనకంటే తర్వాత వచ్చిన తమ్ముడు కార్తీ ఊపిరి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు సినిమా చేస్తానని సూర్యా చాలాకాలంగా చెబుతున్నా వర్కవుట్ కాలేదు. రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని వదులుకుని తప్పుచేశానన్నాడు సూర్య. సికిందర్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. బాహుబలిలో సింగిల్ షాట్ వున్నా చేయడానికి రెడీ అంటూ రాజమౌళిని కోరాడు సూర్య.
త్రివిక్రమ్ సూర్యకు ఓ స్టోరీ లైన్ వినిపించాడన్న వార్త రెండేళ్ల క్రితమే వచ్చినా.. అందరూ మర్చిపోయారు కూడా. లాక్‌డౌన్ టైంలో త్రివిక్రమ్ సూర్య కోసం కథ రెడీ చేసినట్టు తెలిసింది. గతంలో చెప్పిన స్టోరీ లైన్ డెవలప్ చేశాడని టాక్. మరి సూర్యకు ఫోన్ లో వినిపించాడా? లేదంటే.. కరోనా తగ్గిన తర్వాత డైరెక్ట్‌గా వెళ్లి చెబుతాడా? అనే సంగతి తెలియాలి.
త్రివిక్రమ్, సూర్య కాంబినేషన్ ఓకె అయితే... హీరోకు తెలుగు మార్కెట్ మరింత పెరుగుతుంది. పాన్ ఇండియా మార్కెట్ జోలికి వెళ్లని త్రివిక్రమ్ తమిళ తంబీలను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశాడా? లేదా? అన్నది తెలియాలి. త్రివిక్రమ్‌కు ఉన్న క్రేజ్ సూర్యకు తెలుగు మార్కెట్ పెంచినా... తమిళ మార్కెట్ తగ్గకుండా చూడాలి. మరి మాటల మాంత్రికుడు సూర్యను ఎలా చూపిస్తాడో గానీ... ముందు ఎన్టీఆర్‌తో మూవీ మొదలై పూర్తయితేగానీ.. ఈ ప్రాజెక్ట్ వుందీ లేనిదీ చెప్పలేం. మొత్తానికి సూర్యకు తెలుగులో అవకాశం దొరికినట్టే కనిపిస్తోంది. చూడాలి మరి ఆ విలక్షణ నటుడు ఏ విధంగా తన విశ్వరూపం చూపిస్తాడో..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి