సాధారణంగా ప్రతి సంవత్సరం మహేష్ బాబు తన బర్త్ డే కి ఫ్యాన్స్ కి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. ఈసారి కూడా అభిమానులకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని సర్కారు వారి పాట టీం నిర్ణయించుకుంది. ఇంకా 3 రోజుల్లో ఆగష్టు 9 వ తేదీ న మహేష్ బాబు పుట్టినరోజు రోజు సందర్బంగా చిత్ర బృందం ఒక "వాయిస్ గ్లిమ్ప్స్" ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తుంది. ఈ సర్ప్రైజ్ తో అభిమానుల్లో జోష్ నింపాలని చిత్ర బృందం భావిస్తుంది. ఖచ్చితంగా ఇది ఫ్యాన్స్ కి మంచి అనుభూతి ని ఇస్తుందని చిత్ర బృందం వారంతా ఆశపడుతున్నారు. కాగా ఈ సినిమా కు అదిరి పోయే ట్యూన్స్ ఇస్తానని థమన్ ఫ్యాన్స్ కి మాట ఇచ్చి మంచి జోష్ ని నింపాడు. సినిమా లో మహేష్ సరసన కీర్తి సురేష్, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ లు గా ఎంపిక అయ్యారు. మంచి కమర్షియల్ ఎలెమెంట్స్ తో రానున్న ఈ చిత్రం పక్కాగా పెద్ద హిట్ అవుతుంది అని చిత్ర బృందం తో ఫ్యాన్స్ కూడా నమ్మకం గా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి