బిగ్ బాస్ లో జరిగే 24 గంటల మొత్తాన్ని వారు కేవలం వారికి కావాల్సింది మాత్రమే వేస్తారని చెప్పిన పునర్నవి తనని కూడా నెగటివ్ యాంగిల్ లో చూపించినట్టుగా అనిపించిందని అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ న్యూస్ గా మారాయి. ఇక ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ కు వెళ్ళడం ఓ టైం వేస్ట్ పని అన్నట్టుగా తన తమ్ముడితో కలిసి ప్ల కార్డ్ షో చేస్తుంది. కాస్త కూస్తో బిగ్ బాస్ వల్లే పునర్నవి అందరికి బాగా దగ్గరైంది. అలాంటి షో ని అమ్మడు వెళ్ళపోడం బెటర్ అని చెప్పడం షాక్ అయ్యేలా చేస్తుంది.
బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ షో వస్తుంది కదా బిగ్ బాస్ ను వాడుకుని మళ్ళీ పునర్నవి వార్తల్లో ఉండాలని చూస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇంతకీ పునర్నవి ఇలా ఎందుకు చేస్తుంది బిగ్ బాస్ మీద ఇంత కక్ష్య ఎందుకు కట్టింది అన్నది ఆమె చెబితేనే కాని తెలుస్తుంది. హీరోయిన్ గా పెద్దగా ఛాన్సులు లేని అమ్మడు ఇలా అయినా వార్తల్లో ఉండాలని ఇలా చేస్తుందని అంటున్నారు కొందరు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి