వెండితెరపై తన అందంతో అమాయకత్వం అయిన నటనతో
మాయ చేసి ప్రేక్షకుల మనసు దోచేసింది సమంత. తన ఖాతాలో ఎన్నో హిట్లు మరెన్నో సూపర్ హిట్లు. ఆమె నటన
సినిమా కు ప్లస్ అనే విధంగా పేరు తెచ్చుకొని....మా సినిమాకు సమంతానే కరెక్ట్ అనేంత స్థాయికి ఎదిగారు శ్యామ్. అక్కినేని కుటుంబ కోడలు అయిన తర్వాత కూడా నటన పై ఉన్న ప్రేమతో
సినిమా లో కొనసాగుతున్నారు ఈ ముద్దుగుమ్మ. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ ఈ అందాల
తార గ్లామరస్ రోల్స్ కు కాస్త దూరం అయింది అని చెప్పుకోవాలి.
ఓ బేబీ, యూ టర్న్, జాను వంటి విభిన్న కథలను ఎన్నుకుని తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
"బుచ్చినాయుడు కండ్రిగ" చిత్ర ట్రైలర్ ను మంగళవారం తమ చేతుల మీదుగా
అక్కినేని social media ద్వారా విడుదల చేశారు సమంత.
రొమాంటిక్ సోషల్
థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శుభాకాంక్షలు తెలుపుతూ మంచి హిట్ అందుకోవాలని ఆకాంక్షిస్తూ తన ఓటు వేశారు శ్యామ్. ఈ సినిమాకు
కృష్ణ పోలూరు దర్శకత్వం వహించగా శ్రీ సాయి పవర్ క్రియేటివ్ వర్క్స్ బానర్ పై పమిడిముక్కల చంద్ర కుమారి నిర్మించారు.
మున్నా, దృశిక చందర్
హీరో,
హీరోయిన్ గా నటించగా
రవి వర్మ కంచరపాలెం రాజు, ప్రభావతి, పవిత్ర ముఖ్య భూమికలు పోషించారు. పరువు నేపథ్యంలో నడిచే
ప్రేమ కథ తరహాలో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. అయితే ఈ
సినిమా ఈనెల ఆగస్టు 21న "ఆహా" ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.
సమంత మెచ్చుకున్న విధంగానే ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై హిట్టవుతుందనే అంచనాలు పెరిగాయి. ట్రైలర్స్ లో
ప్రేమ కథను త్రిల్లింగ్ గా చూపిస్తూ తనని కాదన్న అమ్మాయిపై ద్వేషాన్ని చూపించే ఓ ప్రేమికుడిని, అదే
అమ్మాయి కోసం పిచ్చివాడైన ఓ కుర్రాడిని, వీటితో ముడిపడిన పరువు అనే కోణాన్ని కలుపుతూ డిఫరెంట్ యాంగిల్ లో ట్రైలర్ ఆసక్తికరంగా చూపించారు.