బాహుబలి సినిమా తో " పాన్ ఇండియన్" హీరోగా మారిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ దెబ్బతో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని సినీ ప్రేక్షకులకు డార్లింగ్ హీరోగా మారిపోయారు. ఇప్పుడు ఈ సక్సెస్ నే ఉపయోగించుకొని ఇటు కెరియర్ పరంగా, అటు దక్షిణాది సినీ ప్రతిష్టను పెంచుతూ నలుమూలలకు విస్తరింపజేసే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు మన బాహుబలి. మన సీనియర్ సూపర్ స్టార్స్ చేయలేని పనిని ఇప్పుడు నేను ముందుకు తీసుకెళ్ళి గెలిపిస్తా అంటూ "ఆది పురుష్" సినిమాతో బాలీవుడ్ కు బయలుదేరాడు రెబల్ స్టార్. అసలు విషయానికొస్తే ప్రభాస్ నూతన చిత్రం "ఆది పురుష్" హిందీ లో చేస్తున్న సంగతి తెలిసిందే... అయితే దీని వెనుక భారీ కారణాలే ఉన్నాయని వెల్లడిస్తున్నాయి సినీవర్గాలు..
ఇంతకుముందు మన సీనియర్ నటులు సాధించని విజయాన్ని ఇప్పుడు ప్రభాస్ తీసుకురావాలని కోరుకుంటున్నారు తెలుగు పరిశ్రమ ప్రముఖులు. సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్ డమ్ ఉన్న మన మెగాస్టార్ చిరంజీవికి అప్పట్లో మాస్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెంచుకున్న గ్యాంగ్ లీడర్ మూవీ ని హిందీలోనూ రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా మెగా ఫ్యాన్స్ ని పెంచుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ స్థాయిలో నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత తమిళ చిత్రం "జెంటిల్ మాన్ " సినిమాను హిందీలో చేసినా కానీ రిటర్న్స్ రాబట్టుకోవడం కష్టతరమైనది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా బాలీవుడ్ లో రాణించలేకపోయారు "అందా కానూన్", "గిరఫ్ తార్", "త్యాగి" లాంటి విభిన్న చిత్రాలు హిందీలో చేసినా క్లిక్ కాలేక చెన్నై మార్కెట్ పైనే ఆధారపడక తప్పలేదు.
ఇక మరో సినీ దిగ్గజం కమల్ హాసన్ కూడా బాలీవుడ్ పై ఆశ పడ్డ వారే, దాదాపు అరడజను పైగా సినిమాలు హిందీలో తీసినా పెద్దగా లాభం లేకపోయింది. దీంతో తిరిగి సౌత్ ఇండియన్ బాటపట్టారు..ఇప్పుడు కాలం మారింది. సినీరంగంలో మార్కెటింగ్ డిజైన్ కూడా మారింది...దాంతో బాలీవుడ్ లో ఖాన్ దాదా లకు పోటీగా "ఆది పురుష్" సినిమాతో బరిలోకి దిగనున్నారు హీరో ప్రభాస్. బాహుబలి సినిమా తో బాలీవుడ్ ప్రేక్షకులకు గ్రాండ్ గా పరిచయమయ్యి ఓ రేంజ్ లో అభిమానులను తన వైపు తిప్పుకున్నారు ప్రభాస్... ఇప్పుడు ఇదే ప్రభాస్ కు ప్లస్ పాయింట్ కానుంది.. సో.... సౌత్ ఇండియన్ బార్డర్ దాటేందుకు సిద్ధమైపోయారు హీరో ప్రభాస్. ఈ విషయంలో మిస్టర్ ఫర్ఫెక్ట్ మన సీనియర్ సూపర్ స్టార్ లకు చాలెంజింగ్ గా మారాడు.. ఎంతవరకు ఫలిస్తుందో అన్నది వేచి చూడాల్సిన విషయమే మరి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి