దీనికి కారణం ఈ షో లో కనిపించేది నటన కాదు... వారి నిజజీవితం. మామూలుగా వారి రొటీన్ లైఫ్ లో ఎలా ఉంటారో... ఈ షో లో కూడా అలానే సహజంగా ఉంటారు. అందుకే ఈ బిగ్ బాస్ షో అంతగా గుర్తింపు పొందింది. ఇందులోని కంటెస్టెంట్ లు వారి హుషారైన మాటలతో, పంచ్ లతో, అల్లరి తో, ముద్దొచ్చే గొడవలతో కొద్దిగా మసాలా యాడ్ చేస్తూ తామేంటో ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కొందరు ఇంటి సభ్యుల మనసులు కలిసి ప్రేమించుకుని నిజ జీవితంలో పెళ్లితో ఒకటైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి కోవకే చెందుతారు ఈ మలయాళీ బిగ్ బాస్ జంట.
వారు మరెవరో కాదు మలయాళం బిగ్ బాస్ షోలో చూపులు కలిసిన వారి లవ్ కు, పెళ్ళితో ప్రాణం పోసిన పెయిర్... మాని & శ్రీనిష్ అరవింద్ ల జంట. షో లో ఉన్నప్పుడే వీరి వ్యవహారం పెళ్లి దాకా వెళుతుందని అందరూ ఊహించినట్లే జరిగింది.. ఇంకేముంది షో అయిిన వెంటనే వివాహం, ఏడాది తిరక్కుండానే తొలి బిడ్డ కు జన్మనిచ్చారు. ఇప్పుడు మరోసారి తల్లి కాబోతున్నా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ మలయాళీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మాని. విషయం తెలుసుకున్న వీరి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి