లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ మూవీ అక్టోబర్ 2న రాబోతోంది. ఆగస్ట్‌లోనే ఈ సినిమా రావాల్సింది. అయితే చాలా మందికి ఈ మూవీని చూపించాం. అందరి సలహాల్ని తీసుకున్నాం. సినిమాని మరింత బెటర్ చేశాం. ఈ మూవీ కోసం మా విక్రమ్‌ని అడిగిన త్రినాథరావు గారికి థాంక్స్. నేను ఎప్పుడో ఆయన్ను నాకు ఓ సినిమా చేసి పెట్టండని అడిగాను. విక్రమ్‌కి ఇంత మంచి అవకాశం ఇచ్చిన త్రినాథరావు గారికి థాంక్స్. నాయుడు గారు పడ్డ కష్టం, ఆయనకి ఉన్న ప్యాషన్ కోసమైనా ‘అనకాపల్లి’ పెద్ద విజయం సాధించాలి. సంధ్య పోషించిన పాత్ర కొత్తగా ఉంటుంది. తారక్ పొన్నప్ప అయితే అందరినీ భయపెట్టేస్తాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ ప్రైజింగ్‌గా ఉంటాయి. మ్యూజిక్, ఆర్ఆర్ అద్భుతంగా కుదిరింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను’ అని అన్నారు.
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ .. ‘నిర్మాతల కష్టం నాకు ఇప్పుడిప్పుడు అర్థం అవుతోంది. సినిమా తీయడం కంటే ఆడియెన్స్ ముందుకు తీసుకు రావడం మరింత కష్టంగా మారింది. నిర్మాతగా కంటే దర్శకుడిగా ఉండటమే బెటర్ అనిపిస్తోంది. కానీ నిర్మాణం అనేది నాకు ప్యాషన్. నిర్మాతగా నా ఈ జర్నీని ఎంజాయ్ చేశాను. మేం ఓపెన్ చేసిన బుకింగ్స్ అన్ని చోట్లా ఫుల్ అవుతున్నాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్‌ని ఎవ్వరూ ఊహించరు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ‘మేం వయసుకు వచ్చాం’ తర్వాత నేను మళ్లీ అలాంటి ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత నాకు మళ్లీ ఓ అద్భుతమైన ప్రేమ కథ తట్టింది. అదే ‘అనకాపల్లి’. ఇందులోని ఫ్యామిలీ డ్రామా గొప్పగా ఉంటుంది. విక్రమ్ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమాతో విక్రమ్‌కి మంచి పేరు వస్తుంది. సంధ్య అద్భుతంగా నటించింది. తారక్ పొన్నప్ప అందరినీ భయపెడతాడు. మా నిర్మాత నాయుడు కూడా ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించాడు. ‘అనకాపల్లి’ సినిమాని అనకాపల్లిలో ప్రదర్శించాం. అక్కడ మాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నిర్మాత కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ చిత్రంలో విక్రమ్ చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమా కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడు. సంధ్య, త్రినాథరావు, తారక్ పొన్నప్ప, ఇంద్రజ ఇలా అందరి పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. అక్టోబర్ 2న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
సంధ్య వశిష్ట మాట్లాడుతూ .. ‘‘అనకాపల్లి’ చిత్రం అక్టోబర్ 2న రాబోతోంది. ఇంటెన్స్, లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాగా మా సినిమా రానుంది. మా మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి