భారతీయ చలనచిత్ర పరిశ్రమకు 2020 సంవత్సరం ఒక విషాదకరమైన సంవత్సరంగా  మారిపోయింది. ఎంతోమంది కళామతల్లి బిడ్డలు కన్ను  మూస్తున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదం లో కి నెడుతున్నారు. వరుసగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుల మృతి నుండీ  సినీ అభిమానులు తేరుకోలేక పోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది యువ నటులతో పాటు దిగ్గజ నటులు కన్నుమూసిన  విషయం తెలిసిందే. ఇక తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన భావజాలంతో.. హావాభావాలతో డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు.



 తెల్లవారుజామున గుండెపోటు రావడంతో బాత్ రూమ్ లోనే కుప్పకూలిపోయారు జయప్రకాష్ రెడ్డి. ప్రస్తుతం జయప్రకాష్ రెడ్డి లాంటి గొప్ప నటుడి మృతి తెలుగు చిత్ర పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. జయప్రకాష్ రెడ్డి మృతి పై ఎంతో మంది సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మరో కళామతల్లి బిడ్డ దూరయ్యారని సంతాపం తెలియజేశారు. 1988లో బ్రహ్మపుత్రుడు సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించిన జయప్రకాష్ రెడ్డి... ఎన్నో సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో నటించి రక్తికట్టించారు. పవర్ఫుల్ విలనిజంతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు...  కామెడీ విలన్ గా  కూడా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు జయప్రకాశ్ రెడ్డి. ప్రేమించుకుందాం రా,  నరసింహారెడ్డి, సమరసింహా రెడ్డి లాంటి సినిమాల్లో పవర్ఫుల్ హీరోయిజం చూపించిన జయప్రకాష్ రెడ్డి.. సుడిగాడు,  సీమటపాకాయ్ ఇలాంటి సినిమాల్లో కామెడీ విలన్ గా  కూడా మెప్పించారు.



 ఇక జయప్రకాష్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని  ఎంతో మంది సినీ ప్రముఖులు ఆయన మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తనదైన డైలాగ్ డెలివరీతో హావభావాలతో ఎంతో మంది యువ నటులకు కూడా స్ఫూర్తిగా నిలిచారు జయప్రకాష్ రెడ్డి. ముఖ్యంగా రాయలసీమ యాస తో భాషతో... ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ లో  ఆయన స్థానాన్ని భర్తీ చేసే నటుడు మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. చివరగా జయప్రకాష్ రెడ్డి  సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: