బిగ్ బాస్ సీజన్ 4 జోష్ మొదలైంది. బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే కావాల్సింది గొడవలు.. ఫైట్లు.. మళ్ళీ వాళ్ళందరికి కలిపే టాస్కులు. ఇలా షోని చూసే ఆడియెన్స్ ను రంజింపచేయడమే బిగ్ బాస్ నిర్వాహకుల పని. ఇదిలాఉంటే బిగ్ బాస్ సీజన్ 4లో 16 మంది కంటెస్టంట్స్ రాగా.. వారిలో స్టార్ కంటెస్టంట్ గా మై విలేజ్ షో గంగవ్వ ఎంట్రీ అందరికి సర్ ప్రైజ్ ఇచ్చింది. సోషల్ మీడియా సెన్సేషన్ గా అరవై ఏళ్ళు పైబడిన గంగవ్వ బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది.  

ఆమెని జాగ్రత్తగా చూసుకోమని స్పెషల్ గా చెప్పి మరి పంపించాడు బిగ్ బాస్. ఇదిలాఉంటే ఉన్న 16మంది కంటెస్టంట్స్ లో బిగ్ బాస్ షో మొదలవగానే గంగవ్వనే ట్రెండింగ్ లో ఉందని చెప్పొచ్చు. అప్పుడే సోషల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. గంగవ్వ ఆర్మీ అంటూ ఓ టీం ఏర్పడి ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న గంగవ్వకి అత్యధిక ఓట్లు వేసి ఆమెను సేఫ్ చేయాలని అనుకుంటున్నారు బుల్లితెర ఆడియెన్స్. ఈ వయసులో బిగ్ బాస్ హౌజ్ లోకి రావడమే ఆమె గెలుపని చెప్పుకోవచ్చు. అలాంటి ఆమెకు ఇప్పుడే ఎలిమినేషన్ ఏంటని బిగ్ బాస్ మీద ఆసక్తి లేని వారు సైతం ఆమెకు ఓటు వేస్తున్నారట.

ప్రతివారం ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిపే క్రమంలో ఈసారి గంగవ్వకే ఎక్కువ ఓట్లు వస్తాయని అంటున్నారు. తప్పకుండా ఆమెను ఐదారు వారాల పాటు కాపాడుతారని.. ఏమో బిగ్ బాస్ ఈ సీజన్ విన్నర్ గా ఆమెను చేసినా చేసే అవకాశం ఉందని అంటున్నారు. విజేతగా ఏమో కాని బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 5లో మాత్రం ఆమె ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. వరల్డ్ ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో రెండు రోజులకే ఆడియెన్స్ లో ఆసక్తి మొదలైంది. అయితే ఈ సీజన్ లో ఎవరు ది బెస్ట్ గా నిలుస్తారు.. ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: