తెలుగు నటి శ్రావణి ఆత్మహత్య విషాద వార్త తో ప్రేక్షకులకు షాక్ కు గురయ్యారు... మనసు మమత,  మౌనరాగం  వంటి పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడడం అందరి మనసులను కలవర పెట్టింది. అయితే తమ అమ్మాయి శ్రావణి ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ప్రియుడు దేవరాజ్ వేధింపులేనని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు... ఇప్పుడు ఈ కేసు మిస్టరీలో కొత్త కొత్త ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. శ్రావణి ఆత్మహత్య కు కారణం తను కాదని సాయి అనే వ్యక్తి కారణమని తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆరోపించాడు దేవరాజ్ రెడ్డి. దీంతో కేసు ఇప్పుడు సాయి వైపుకు యూటర్న్ తీసుకుంది. సాయి అనే వ్యక్తి శ్రావణి ని కొట్టి హింసించేవాడని.. అతడి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని... వివరించాడు శ్రావణి స్నేహితుడు దేవరాజ్.



కాగా ఈ  సెప్టెంబర్ 7న తాను శ్రావణి కలిసి డిన్నర్ కు వెళ్లామని.. అక్కడకు సాయి వచ్చి శ్రావణిపై చేయి చేసుకొని ఇబ్బంది పెట్టాడు. శ్రావణికి ఐదేళ్లుగా సాయితో పరిచయం ఉందంటూ చెప్పుకొచ్చాడు దేవరాజ్. కుటుంబ సభ్యులు అంతా కలిసి శ్రావణి సాయి అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఒత్తిడి చేసినట్లు. పైగా సాయి ఆమెను దూషించడం, హింసించడం, కొట్టడం వల్లే శ్రావణి ఆ బాధలను భరించలేక ఆత్మహత్య చేసుకొన్నది తెలిపాడు. అంతేకాదు శ్రావణి సూసైడ్‌కు ముందు తనకు ఫోన్ చేసి ఈ విషయాలను చెప్పి. ఇక ఆ ఇంట్లో ఉండలేనని తాను ఒప్పుకుంటే ఇంట్లో ఉన్నది నగలను డబ్బులు తీసుకొని వచ్చేస్తానని చెప్పినట్లు తెలిపారు. శ్రావణి మరణానికి కారణం వారి కుటుంబ సభ్యులు మరియు సాయి అనే వ్యక్తి అంతేకాని నేను కాదు అంటున్న దేవరాజ్ ... కావాలంటే శ్రావణి ఫోన్ కాల్ రికార్డింగ్ ల క్లిప్ లను పోలీసులకు అందజేస్తాం అంటూ చెప్పుకొచ్చారు దేవరాజ్.



అయితే ఈ ఆరోపణలు విన్న సాయి వెలుగులోకి వచ్చాడు. అందరినీ షాక్ కి గురి చేశాడు. దేవరాజు రెడ్డి విడుదల చేసిన ఆ వీడియో లో ఏ మాత్రం నిజం లేదని ఒట్టి పుకార్లేనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను శ్రావణి ఫ్యామిలీకి స్నేహితుడని.. శ్రావణి చనిపోయినప్పటి ఎంతో బాబాధపడుతున్నా , చనిపోయినప్పటినుండి మృతదేహంతోనే ఉన్నానని తెలిపాడు. తాను ఎక్కడికి పారిపోలేదని.. పోలీసులతోనే ఉన్నానని సాయి వెల్లడించాడు. ఇలాంటి అనుమానాల నేపథ్యంలో అసలు నేరస్తుడు ఎవరు శ్రావణి చనిపోవడానికి కారణాలు ఏంటనేది తెలియాల్సి  ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: