యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ హిట్ అందుకున్న రాజమౌళి ఆ తర్వాత మరొక సారి కూడా ఎన్టీఆర్ తో తీసిన సింహాద్రి సినిమా తో మరింత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని దర్శకుడిగా మరింత పేరు తెచ్చుకున్నారు. ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగిన రాజమౌళి తాను తీసే ప్రతి ఒక్క సినిమాతోనూ ఒక్కో హిట్ కొట్టి దర్శకుడిగా తన స్థాయిని మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగారు.    

ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆయన తీసిన బాహుబలి రెండు సినిమాలు కూడా ఒకదానిని మించి మరొకటి అద్భుత విజయాలు సాధించి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా అద్భుతమైన సక్సెస్ ని అందుకోవడం, భారీ స్థాయిలో కలెక్షన్ ని దక్కించుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం యంగ్ టైగర్, ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో రాజమౌళి తీస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ కొమరం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు కనిపించనున్న ఈ సినిమాలో ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మొదట ఈ ఏడాది జులై 30న రిలీజ్ చేయాలని భావించింది మూవీ యూనిట్. అయితే సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో దానిని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8 కి మార్చారు.  

అయితే ఇటీవల కొన్ని నెలలుగా కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ వలన మిగతా సినిమాల మాదిరిగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా నిలిచిపోవడం జరిగింది. ఇక అతి త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమాని ఇటీవల అనుకున్న విధంగా జనవరి 8న రిలీజ్ చేయడం కుదరదని, కాగా తమ సినిమాని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందట ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్. అలా మొదట్లో అనుకున్న అదే తేదీన వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కాబోతుండడం ఒకరకంగా  యాదృచ్చికమని భావిస్తున్నారట మూవీ యూనిట్ సభ్యులు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: