తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువగా సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు. సినిమా మహూర్తాలతోపాటు.. నటీ నటుల విషయంలో కూడా సెలక్టివ్ గా వెళ్తుంటారు. ఐరన్ లెగ్ అనే ముద్ర పడితే ఇక వారి జోలికి ఎవరూ వెళ్లరు. అలాంటి తెలుగు ఇండస్ట్రీకి బాలీవుడ్ నటులు విలన్లుగా పరిచయం కావడం ఎప్పటినుంచో ఉంది. కానీ బాలీవుడ్ నటులు విలన్లుగా చేసిన భారీ సినిమాలన్నీ దాదాపుగా ఫెయిలవుతూనే ఉన్నాయి. మొత్తం దక్షిణాదికే ఈ సెంటిమెంట్ ఉందని చెప్పుకోవాలి. జాకీష్రాఫ్ లాంటి వెర్సటైల్ యాక్టర్ కూడా చాలా సార్లు దక్షిణాదిలో నిరాశపరిచే ఫలితాలిచ్చారు. పవన్ కల్యాణ్ పంజా సినిమా నుంచి, నిన్నమొన్నటి సాహో వరకు.. జాకీష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమాలేవీ హిట్ కాలేదు. ఇటీవల అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి కూడా రజినీకాంత్ కి విలన్లుగా నటించిన సినిమాలు ఫ్లాపయ్యాయి. దీంతో బాలీవుడ్ విలన్లంటేనే తెలుగు సినీ పరిశ్రమ భయపడే పరిస్థితి వచ్చింది.

అయితే తాజాగా మహేష్  బాబు ఈ నెగెటివ్ సెంటిమెంట్ భయాన్ని కాస్త పక్కనపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు కొత్త సినిమా సర్కారువారి పాటలో బాలీవుడ్ ఒకప్పటి ప్రముఖ హీరో అనిల్ కపూర్ విలన్ గా చేస్తున్నారనే వార్తలొస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో ప్రారంభమవుతుందని అనుకుంటున్నారు. అమెరికాలో లొకేషన్లు చూడటం కోసం దర్శకుడు పరశురామ్ వెళ్తున్నారని కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ విలన్ ప్రస్తావన కూడా వచ్చింది.
అనిల్ కపూర్ ని సర్కారువారి పాటలో విలన్ గా తీసుకుంటున్నారనే వార్తలొచ్చాయి. ప్రముఖ బాలీవుడ్ సినిమా వెబ్ సైట్ లలో ఈ కథనాలు రావడంతో ఇది వాస్తవమనే ప్రచారం జరుగుతోంది. మహేశ్ బాబు, అనిల్ కపూర్ చాలా రేర్ కాంబినేషన్. వయసు పైబడుతున్నా అనిల్ కపూర్ లో ఇంకా ఆ ఛార్మింగ్ తగ్గలేదు, స్లిమ్ లుక్ మెయింటెన్ చేస్తూ ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా కనపడుతున్నారు అనిల్. అలాంటి అనిల్ ని స్టైలిష్ విలన్ గా పరిచయం చేయబోతున్నారట పరశురామ్. మరి మహేష్ ని ఈ నెగెటివ్ సెంటిమెంట్ ప్రభావితం చేస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: