కాగా, ఈ సీజన్ లో వచ్చిన ప్రతివాల్లు సమాజంలో ఏదోక రంగంలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళే.. అందులో గంగవ్వ, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి జీవిత విశేషాలు కాస్త ఎమోషన్ అనిపించాయి. అయితే ఈ షో లో వేరే రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చిన పస లేదంటూ ప్రేక్షకులు అంటున్నారు. కాగా షో మొదలై వారం రోజులు పూర్తికావడంతో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. అయితే నామిషన్ జోన్ లో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఎటూ చూసిన కూడా షో నుంచి ఎలిమినేట్ అవుతాడని నెటిజన్లు అభిప్రాపడుతున్నారు..
మరి వారి అంచనాలు ఏ మాత్రం తీరతాయో తెలియాలంటే ఈరోజు ప్రసారం కానున్న ఎపిసోడ్ ను చూడాల్సిందే.. ఇది ఇలా ఉండగా ఎప్పటిలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్త వాళ్ళను హౌస్ లోకి పంపిస్తున్నారు. ఈ సారి ఏకంగా ముగ్గురిని హౌస్ లోపలికి పంపిస్తున్నారట.. జబర్దస్త్ అవినాష్, కమెడియన్ సాయి, నటి స్వాతి దీక్షిత్. వీరు ముగ్గురు ఒకేసారి వస్తారా లేక ఒక్కొక్కరిని ఒక్కోసారి పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. నెక్స్ట్ వారం ఎలిమినేషన్ ప్రక్రియ రేపు మొదలు కానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి