యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటుగా ప్రభాస్, పూజాల ఫస్ట్ లుక్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. ఎల్లలుదాటిన ప్రేమ ఎలాంటి ఉప్పెనని లెక్క చేయదు అని చెప్పేలా పోస్టర్ అదిరింది.

కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ కు సిద్ధమవుతున్నారు చిత్రయూనిట్. పూజా హెగ్దే కూడా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేసింది. అయితే రాధే శ్యామ్ లో ప్రభాస్ కాకుండా మరో హీరో కూడా ఉన్నాడట. అతనెవరో కాదు తమిళ హీరో అధర్వ అని తెలుస్తుంది. కోలీవుడ్ లో హీరోగా చేస్తూ అడపాదడపా తెలుగులో మెరుస్తున్నాడు అధర్వ. లాస్ట్ ఇయర్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో కూడా అధర్వ నటించాడు.      

ఇక ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాలో కూడా సినిమాను మలుపు తిప్పే పాత్రలో అతను నటిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో పూజా హెగ్దే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. 2021 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమాలో అధర్వ సీక్రెట్ రోల్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో భరీ ఎత్తున ఆ సినిమా ప్లాన్ చేశారు. ఇక నాగ్ అశ్విన్ తో కూడా ప్రభాస్ సినిమా లైన్ లో ఉంది.                   

మరింత సమాచారం తెలుసుకోండి: