ఇటీవల నాని, సుధీర్ బాబు ల కలయికలో ఇంద్రగంటి మోహన కృష్ణ తీసిన లేటెస్ట్ సినిమా వి. అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించిన ఆ సినిమాకు అమిత్ త్రివేది సంగీతాన్ని అందించగా ఎస్. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం జరిగింది. ఇటీవల ఎన్నో అంచనాల మధ్య ప్రముఖ ఓటిటి మాధ్యమం అమేజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది. అంతకముందు మంచి సక్సెస్ లు అందుకుంటూ కొనసాగిన దర్శకుడు ఇంద్రగంటి నుండి ఇటువంటి సినిమా ఆశించలేదంటూ పలువురు ప్రేక్షకులు విమర్శలు ఎక్కు పెట్టడం జరిగింది.  

వాస్తవానికి తొలి సినిమా గ్రహణంతో గొప్ప పేరును అలానే పలు అవార్డులను అందుకున్న ఇంద్రగంటి, ఆ తరువాత నాని ని హీరోగా పరిచయం చేస్తూ అష్టాచమ్మా సినిమా తీసి పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన ఇంద్రగంటి సినీ కెరీర్ లో మంచి సక్సెస్ లతో పాటు మధ్యలో కొన్ని ఫ్లాప్స్ కూడా వచ్చాయి. ఇక ఇటీవల నానితో ఇంద్రగంటి తీసిన జెంటిల్ మ్యాన్, అలానే సుధీర్ బాబుతో తీసిన సమ్మోహనం సినిమాలు ప్రేక్షకుల నుండి మంచి క్రేజ్ ని దక్కించుకుని బాగా సక్సెస్ అయ్యాయి. అయితే ప్రస్తుతం తాను తీసిన వి సినిమా ఫెయిల్ అవడంతో, జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, అందుకే ఇకపై తన నుండి రాబోయే సినిమాలపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చూస్తున్నారట ఇంద్రగంటి.  

అతి త్వరలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఇంద్రగంటి చెప్పారు. అయితే ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు టైం పడుతుందని ఆయన అన్నారు. మరి ఇకపై తాను తీయబోయే సినిమాలతో ఇంద్రగంటి ఏ రేంజ్ సక్సెస్ లు అందుకుంటారో చూడాలి .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: