ఆ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. జబర్దస్త్ లో ఇదివరకు చేసిన వేణు, ధన్ రాజ్ లు అక్కడ టీం లీడర్స్ గా చేస్తున్నారు. ఇక ఇక్కడ నుండి చమ్మక్ చంద్ర బయటకు వచ్చేసి అదిరిందిలో జాయిన్ అయ్యాడు. గల్లీ బోయ్స్ అని పటాస్ లో టాలెంట్ చూపించిన కొందరికి ఛాన్స్ ఇచ్చారు. అయితే అదిరింది షో లైన్ లో సక్సెస్ అవగా ఇప్పుడు బొమ్మ అదిరింది అని కొత్త షో మొదలుపెట్టారు.
అదిరింది.. బొమ్మ అదిరింది షోలను చూస్తుంటే.. ఇది పక్కా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఫార్ములాతోనే వచ్చినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 కి వెళ్ళిన శ్రీముఖి ఆ షో అయ్యాక ఈటివి పటాస్ చేయలేదు. ఇక మరోపక్క స్టార్ మా కొన్ని షోస్ చేసింది. అయితే అనసూయ, రష్మిల్లా పర్మినెంట్ షో కావాలని చూస్తున్న శ్రీముఖికి జీ తెలుగు మంచి ఆఫర్ ఇచ్చింది. బొమ్మ అదిరిందిలో శ్రీముఖి యాంకర్ గా చేస్తుందని తెలుస్తుంది. ప్రోమో ఎపిసోడ్ లో సుమ కూడా కనిపించింది. నాగబాబు, జానీ మాస్టర్ ఇలా అందరు బొమ్మ అదిరింది షోలో ఉంటున్నారని తెలుస్తుంది. మరి అదిరింది.. బొమ్మ అదిరింది ఇవి ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తాయో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి