అన్నయ్యలు సూపర్ హిట్ లు కొడుతూ దూసుకెళ్తుంటే.. తమ్ముళ్లు మాత్రం పడిపోతున్నారు. పెద్దోళ్లు స్టార్ రేసులో పోరాడుతుంటే.. చిన్నోళ్లు గుర్తింపు తెచ్చుకోవడానికి మూడు చెరువుల నీళ్లు తాగుతున్నారు. ఎంత ట్రై చేసినా స్టార్డమ్ ను సంపాదించుకోలేకపోతున్నారు.

అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇద్దరూ అల్లు అరవింద్ వారసులుగానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరూ గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేశారు. కానీ అన్నయ్య సూపర్ పొజిషన్ లో ఉంటే.. తమ్ముడు మాత్రం చోటా హీరోగానే మిగిలిపోయాడు. బన్నీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తోంటే.. శిరీష్ మాత్రం తెలుగునాట మార్కెట్ సంపాదించుకోవడానికి కష్టపడుతున్నాడు.

నాగార్జున వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య, అఖిల్. అయితే అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ హీరోల్లో అఖిల్ ఇప్పటికీ సరైన బ్లాక్ బస్టర్ కొట్టలేదు. చైతన్య లవర్ బాయ్ గా మార్కెట్ పెంచుకుంటుంటే.. అఖిల్ మాత్రం ఇంకా ఫస్ట్ బ్లాక్  బస్టర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.

విజయ్ దేవరకొండ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన.. ఫస్ట్ మూవీతోనే ఇంప్రెస్ చేశాడు. అర్జున్ రెడ్డితో యూత్ స్టార్ గా ఎదిగాడు. అయితే అన్నయ్య రూట్ లోనే సినిమాల్లోకి వచ్చిన తమ్ముడు ఆనంద్ దేవరకొండ మాత్రం విమర్శల్లో పడ్డాడు. దొరసానితో లాచ్ అయిన ఈ కుర్రాడిని తెగ ట్రోల్ చేశారు నెటిజన్లు.

అన్నయ్యలను చూసుకొని మరికొంతమంది తమ్ముళ్లు సినిమాల్లోకి వస్తున్నారు. పెద్దోడి స్టార్డమ్ చూసి.. చిన్నోడు కూడా ఆ స్థాయిలో మెప్పించాలని కలలు కంటున్నారు. భారీ డ్రీమ్స్ తో తెరపైకి వస్తున్నారు. మరి వీళ్లైనా తమ్ముడి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి.. గుర్తింపు తెచ్చుకుంటారా.. లేక ఫలానా హీరో తమ్ముడిగానే మిగిలిపోతారా అనే అనుమానం కలుగుతోంది.  

దగ్గుబాటి కాంపౌండ్ నుంచి వచ్చిన సెకండ్ జనరేషన్ స్టార్ రానా. కెరీర్ బిగినింగ్ లోనే నార్త్ కి వెళ్లాడు. హీరో కమ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా బోల్డంత్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అరణ్య లాంటి సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ గా మారుతున్నాడు. ఇప్పుడీ అన్నయ్య రూట్ లోనే తమ్ముడు అభిరామ్ కూడా హీరోగా లాంచ్ అవుతున్నాడు. ఆల్ రెడీ అభిరామ్ కోసం స్టోరీస్ సెలక్షన్ కూడా స్టార్ట్ అయ్యిందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: