బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కరోనా కారణంగా చాలా స్లో అయింది. దాదాపు ఇప్పటికే ఎన్నో చిత్రాలు విడుదలయి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాల్సింది. అయితే కాలం కన్నెర్రచేసింది, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందిపడేలా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కుదుటపడుతోంది కేంద్రం షూటింగులకు ఇచ్చిన అనుమతులతో సగంలోనే ఆగిపోయిన సినిమాలను పూర్తిచేసే పనిలో పడ్డారు. అందులో ముఖ్యంగా కొన్ని సినిమాలు మనముందుకు రానున్నాయి. అయితే థియేటర్లపై ఇంకా స్పష్టత రాకపోవడంతో అందరూ ఓ టి టి ల వైపే తమ దృష్టిని పెడుతున్నారు.

యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సూర్యవంశీ సినిమా దీపావళి సమయంలో థియేటర్లలోకి వస్తుందని ఊహించినా ఇప్పుడు అది కాస్తా వాయిదా పడింది. కాగా ఆయన నటించిన మరో చిత్రం `లక్ష్మీ బాంబ్`  నవంబర్ 9 న ఓ టి టి వేదికగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది. అంతేకాకుండా రణవీర్ సింగ్ నటించిన  83 మరియు సూర్యవంశీ సహ నిర్మాత రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సిఇఒ షిబాసిష్ సర్కార్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. “సూర్యవంశీ కోసం 83 తేదీని మార్చడానికి మేము ఖచ్చితంగా ఇష్టపడం. స్పోర్ట్ డ్రామా ఇప్పటికీ క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధం చేశాం. దర్శక హీరోలతో మాట్లాడి సూర్యవంశీ  కొత్త తేదీని మేము నిర్ణయించుకోవాలి. కాని ఈ చిత్రం జనవరి మార్చి మధ్య విడుదల కావాలి`` అని తెలిపారు. జూన్ లో థియేటర్ యజమానులు దీపావళి నాటికి `సూర్యవంశీ` చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ధృవీకరించగా `83` చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా తెరపైకి వస్తుందని ఊహాగానాలు సాగించారు. అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ ..

సూర్యవంశి ఇంతకుముందు మార్చి 27 న విడుదల కావాల్సి ఉండగా.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా   వాయిదా పడింది. ఈ చిత్ర నిర్మాతలు దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సూర్యవంశీ కాప్ డ్రామాతో తెరకెక్కినది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ డిసిపి వీర్ సూర్యవంశి పాత్రలో నటించారు.

83 విషయానికి వస్తే ఈ చిత్రం భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచ కప్ గెలుపు ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించగా... క్రికెటర్ భార్య రోమి దేవ్ పాత్రలో దీపికా పదుకొనే కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10 న తెరపైకి రావాల్సి ఉన్నా.. ఇప్పుడు క్రిస్మస్ ని ఖాయం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: