చాలమంది స్టార్స్ స్టైలిష్ గా కనిపించడానికి మెడలో లేదా చేతి మణికట్టుకి బ్రాస్ లెట్ రూపంలో బంగారం వస్తువులను స్టైల్ గా ధరిస్తూ ఉంటారు కానీ బన్నీ మాత్రం అలాంటి గోల్డ్ యాక్ససరీస్ ధరించడానికి ఆసక్తిని చూపించడట. అంతేకాదు స్టైలిష్ గా కనిపిస్తూనే సింపుల్ ఉండే వాటిని ధరించడానికి బన్ని ఇష్టపడుతూ ఉంటాడని అందుకే తాను బన్నీని బాగా ఇష్టపడతాను అంటూ కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ కు చెందిన హర్మాన్ కౌర్ స్టైలిస్ట్ గా సౌత్ హీరో బన్నీతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత ఆమె బాలీవుడ్ లో ప్రముఖ స్టైలిస్ట్ గా మారింది. ఇదే ఇంటర్ వ్యూ లో ఆమె మరోకా ఆసక్తికర విషయం బయటపెట్టింది. బన్ని స్టైల్స్ ను చాలమంది బాలీవుడ్ హీరోలు ఇష్టపడతారు అన్న విషయాన్ని కూడ ఆమె లీక్ చేసింది.
ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండకు కూడా స్టైలిస్ట్ గా వర్క్ చేస్తోంది. బన్నీతో పోలిస్తే విజయ్ దేవరకొండ డిఫరెంట్ అని చెపుతూ స్టైల్స్ విషయంలో విజయ్ చాలా డిఫరెంట్ గా ఉంటాడని చెపుతూ స్టైల్ విషయంలో ప్రయోగాలు చేయడానికి విజయ్ ఎప్పుడు తపన పడుతూ ఉంటాడు అన్న విషయం తెలియచేసింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు చాలామంది దక్షిణాది హీరోలు ఎలాంటి స్టైల్స్ అనుసరిస్తున్నారు అన్నవిషయం చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు అని చెపుతూ దక్షిణాది హీరోలకు బాలీవుడ్ లో క్రేజ్ పెరుగుతున్న విషయాన్ని తెలియచేసింది. స్టైల్ కు ప్రాణం పెట్టే అల్లు అర్జున్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘పుష్ప’ మూవీలో మాసిన గెడ్డం లుంగీ నలిగిపోయిన షర్ట్ తో చాలసేపు ఆ సినిమాలో కనిపించబోతు ఉండటం చూస్తే బన్నీ ఒక పాత్ర కోసం ఎలా మారిపోతాడో అర్ధం అవుతుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి