అన్యాయం అనిపించిన ప్రతి విషయాన్ని... గలమెత్తి ప్రశ్నిస్తారు.... విమర్శిస్తారు తెలకపల్లి రవి.. ఎక్కువగా రాజకీయ రంగాల గురించి మాట్లాడే ఈయన తాజాగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టాడు.... ఇంతకీ ఏం ప్రస్తావించారు అంటే...తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవం.... తన డైరెక్షన్ తో ఎటువంటి స్టోరీని అయినా అద్భుతంగా మలచి మాణిక్యంలా మెరిపించ గల జక్కన్న.... ఎస్.ఎస్.రాజమౌళి తీస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి క్రింది విధంగా  మాట్లాడారు రవి.

పెద్ద పెద్ద స్టార్ హీరోలని సెలెక్ట్ చేసుకొని వాళ్లతో జాతీయ చిత్రాలు తీయడం సమంజసమే మరియు సంతోషమే. వందల కోట్ల పెట్టుబడులతో దర్శకులు ఏళ్ళతరబడి కథలను రాసి.... పాత్ర స్థాయికి మించి.. అగ్ర హీరోలను ఆకాశానికి ఎత్తేయడం... వారిని ఎంతో అద్భుతంగా చూపించడం ఓకే... కాకపోతే ఇక్కడ తెలియాల్సింది ఏమంటే..?? ఆ క్రమంలో ఆ సినిమాల కథల ద్వారా మూఢ నమ్మకాలను మరియు అశాస్త్రీయ విషయాలను, ఆఖరుకు బానిస ప్రవృత్తిని కూడా ప్రచారం చేయడం సినిమాలో భాగం అని.. అది కూడా కథలో ఒక అంశమని అని సరిపెట్టుకోవచ్చు.

కాని చరిత్ర ముద్ర వేసుకుని కూడా తమ కల్పనతో నడిపిస్తామంటే కూడా ఒప్పుకోవలసిందేనా? చరిత్ర పరిధిలో కల్పన తప్పదు గాని చరిత్రనే కల్పనగా మార్చిచరిత్ర పురుషులను స్టార్‌ హీరో తరహాలో ప్రచారంలో పెట్టడం సమంజసమేనా? గొప్ప ప్రచారం స్టార్ హీరోల సపోర్ట్ వున్న భారీ సినిమాలు ఎలానూ మంచి ఫలితాలు ఇస్తాయి. కాని ఆ క్రమంలో చరిత్రకు ఏమవుతుంది? అన్న విషయం ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. హాలివుడ్‌ లో కూడా  ఈ తరహా చిత్రీకరణ ఉంటుంది.  . అయితే దానికి కొన్ని ప్రమాణాలు వున్నాయి.మనం వాటిని పాటిస్తున్నామా?  అంటే ఓసారి మనమే ఆలోచించాల్సి ఉంటుంది.

రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ టీజర్ల విడుదల తర్వాత తలెత్తుతున్న సందేహాలివి. అల్లూరి సీతా రామరాజు కొమరం భీమ్‌ను కలపడం ఒక కల్పన. వారిద్దరూ ఒక దశలో ఇంటి నుంచి వెళ్లిపోయారనే కామన్‌ పాయింట్‌ తీసుకున్నామన్నారు. స్వతంత్ర పోరాటం ఇందులో వుండదని దర్శకుడు సినిమా చిత్రీకరణ మొదలు పెట్టకముందే చెప్పేశారు. అంటే యోధులుగా వారి ప్రసిద్ధి ఉపయోగిస్తూనే ఇతర అంశాలపై కేంద్రీకరణ వుంటుందన్న మాట. నాయికగా సీత పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుందని మరో వార్త. ఇద్దరు చారిత్రక వ్యక్తులు ఒకరి గురించి ఒకరు చెప్పడం ఆసక్తికరమే కాని ఆ హీరో అభిమానులను ఆనంద పరిచే తాపత్రయంలో నిజమైన చరిత్ర హీరోలను ఆ ఫ్రేములోకి తీసుకురావలసిందేనా ? ఫ్యాన్స్, స్టార్స్‌  అనగానే ఎవరికి ఎక్కువ... ఎవరికి తక్కువ అని మీడియాలో సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు, వివాదాలు మొదలవుతాయి. చరిత్ర మూలాలతో పని లేకుండా.. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు  కథకూ.. పాత్రకూ మెలికలు. కాని చరిత్ర వీరులను ఫార్ములా ఫ్రేములో కుదించడం అవాంచనీయం కాదా? రామ్‌ చరణ్‌ రంగస్థలం ఎంత వాస్తవికంగా తీశారు? హిట్‌ కాలేదా? ఇటువంటి చిత్రాల వలన ఎటువంటి అపరాధము జరగదు... అంటూ విమర్శించారు తెలకపల్లి రవి.

ముందస్తు సెన్సారింగ్‌ లూ షూటింగులపై దాడులు ప్రజాస్వామ్య సంస్కృతి కాదు. అటువంటి వాటిని సహించ కూడదు, ప్రోత్సహించకూడదు.. కాని సృజన స్వేచ్చను చారిత్రిక వాస్తవాలతో  సమన్వయం చేశామని చెప్పేబదులు దానితో సంబంధం లేదని పదే పదే ప్రకటించడం దేనికి సంకేతం? చరిత్ర వీరులకు ఏం గౌరవం? వారి పాత్ర టీజర్లు హీరో మధ్య పోటీగా మారడం వూహకందేదేనా ? ఎన్టీఆర్‌  పౌరాణిక పాత్రలు వేస్తే మమేకత వచ్చిందే గాని స్టార్‌ వాల్యూ చూడలేదు. మహాకవులు, రాజులు, చక్రవర్తుల కథలు కూడా వున్నంతలో చరిత్రకు అనుగుణంగా తీశారే గాని స్టార్స్‌ను బట్టి కాదు, కాని ఇక్కడ షూటింగు మొదలవడానికి ముందునుంచే స్టార్‌ వాల్యూ కీలకమై పోతే మిగిలిన విషయాలు ఏమవుతాయి? పరిశ్రమ పెద్దలు, అగ్ర దర్శకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తును ఆలోచించాల్సి ఉంటుంది. అని జక్కన్న చిత్ర కథను ఫోకస్ చేస్తూ మన చరిత్రకు అనుసంధానం చేస్తూ మాట్లాడారు రవి. 

మరింత సమాచారం తెలుసుకోండి: