నిర్మాత దిల్ రాజ్ కు ‘ఎఫ్ 2’ ‘ఫిదా’ సినిమాలలో వచ్చినన్ని లాభాలు అతడు ఇప్పటివరకు నిర్మించిన ఏ సినిమాలలో రాలేదు అని అంటారు. ‘ఎఫ్ 2’ ఇచ్చిన జోష్ తో వెంటానే ‘ఎఫ్ 3’ సినిమాను ప్రకటించినా ఈ సినిమా  ప్రాజెక్ట్ అనుకున్న దగ్గర నుంచి అన్ని సమస్యలే ఎదురవుతున్నాయి. ఈ మోవీ ప్రకటించిన తరువాత అనీల్ రావిపూడిమూవీ స్క్రిప్ట్ పై దృష్టి పెట్టకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేసారు.  


మూవీ హడావిడ్ పూర్తి అయిన తరువాత ‘ఎఫ్ 3’ స్టార్ట్ చేయాలని చకచకా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కూడా పూర్తి చేసారు కానీ కరోనా వచ్చి బ్రేక్ వేసేసింది. ఇప్పుడు మళ్ళీ కరోన భయాలు పక్కకు పెట్టి సినిమాల షూటింగ్ లు మొదలు కావడంతో మళ్ళీ ‘ఎఫ్ 3’ ప్రయత్నాలు మొదలు అయ్యాయి. వెంకటేష్ ‘నారప్ప’ వరుణ్ తేజ్ ‘బాక్సర్’ పూర్తి చేసుకుని వస్తే ‘ఎఫ్ 3’ మొదలు పెట్టడానికి రంగం సిద్దం అయినప్పటికీ ఈసినిమాకు సంబంధించి వాటాల  దగ్గర పీఠముడి పడినట్లు లీకులు వస్తున్నాయి.  


వెంకటేష్ డేట్ లు సంపాదించే విషయంలో వెంకీ సోదరుడు సురేష్ బాబు దగ్గర బేరం అంత సులువుగా తెగలేదని తెలుస్తోంది. చివరకు రెమ్యూనిరేషన్ ఫ్రాఫిట్ షేరింగ్ ప్రాతిపదికన వెంకటేష్  దిల్ రాజ్ అనిల్ రావి పూడి ల మధ్య లెక్కలు సెట్ అయినట్లు గాసిప్పులు వస్తున్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీ షూటింగ్ జనవరిలో ప్రారంభం అయి వచ్చే ఏడాది దసరా రేస్ కు విడుదల అయ్యే విధంగా విధం గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంభందించి మూడవ హీరోగా సునీల్ ఎంపిక ఖాయం అయింది అని అంటున్నారు. మరి ఈ ‘ఎఫ్ 3’ సీక్వెల్ ఎంతవరకు విజయవంతం అవుతుంది చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: