విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ' బిచ్చగాడు ' చిత్రం అందరికీ గుర్తుంది పోతుంది. ఆ సినిమా లో తన నటన గురించి ఎంత వర్ణించినా తక్కువే. అలానే ఇప్పటికీ ఆ సినిమా లోని ఓ పాట అన్ని చోట్లా వినబడుతూనే ఉంటుంది. ఇది ఇలా ఉండగా బిచ్చగాడు సినిమా తర్వాత ఈ బ్యానర్ లో కొన్ని సినిమాలు వచ్చాయి...... కానీ అవి అంత గొప్ప విజయాన్ని మాత్రం అందుకోలేదు.
తాజాగా ఈ బ్యానర్ లో మరో మూవీని ప్రకటించడం జరిగింది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై చదలవాడ బ్రదర్స్ సమర్పణ లో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' అనే టైటిల్ తో వస్తోంది. ప్రముఖ నటీ నటులు నటించనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. లుక్‌ని కూడా ఆదివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకుడు. న్యూ డైమెన్షన్ క్యారెక్టర్ లో లక్ష్ హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి