మెగాస్టార్ చిరంజీవి గతేడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాని తర్వాత మెగాస్టార్ నటించిన సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ కు ముందు 50శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతుండగా ఇందులో మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక మరో వైపు ప్రస్తుతం వకీల్ సబ్ సినిమా తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరొక పీరియాడికల్ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని అలానే ఇందులో ఆయన పాత్రలు రెండూ కూడా ఎంతో అదిరిపోతాయి అని సమాచారం. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూలు అతి త్వరలో ప్రారంభం కాబోతుతుండగా ఇందులో పవన్ కి జోడీగా ఒక ప్రముఖ హీరోయిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే అటు ఆచార్య ఇటు పవన్ క్రిష్ ల సినిమాలు రెండూ కూడా పక్కాగా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్. మరోవైపు ఆ రెండు సినిమాల యూనిట్లు కూడా పక్కాగా తమ సినిమాలను ఆ సమయంలోనే రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారని అంటున్నారు. ఇదే కనుక జరిగితే మాత్రం తొలిసారిగా మెగా స్టార్, పవర్ స్టార్ ల మధ్య భారీ బాక్సాఫీస్ యుద్దం తప్పదని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఇది నిజంగా జరుగుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు ఓపిక పట్టక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: