టాలీవుడ్ లో డైరెక్టర్ల కొడుకులను ఒక సెంటిమెంట్ భయపెడుతూ ఉంటుంది. ఎంత పెద్ద దర్శకుడి వారసుడైనా తెలుగులో స్టార్ కాలేడనే సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు ఓ ప్యామిలీ మూవీ మేకర్ కొడుకుని కూడా ఇదే సెంటిమెంట్ టెెన్షన్ పెడుతోందట.

రాఘవేంద్రరావు ఎంతోమందికి సూపర్ స్టార్డమ్ అందిచ్చాడు. మాస్ హీరోలుగా నిలబెట్టాడు. ఇలాంటి దర్శకేంద్రుడి వారసుడు ప్రకా్ కోవెలమూడి మాత్రం స్టార్ హీరో కాలేకపోయాడు. నీతో, మార్నింగ్ రాగా లాంటి సినిమాల్లో నటించిన ప్రకాశ్, యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి, తర్వాత దర్శకుడిగా మారిపోయాడు.

కమర్షియర్ ఎంటర్ టైనర్స్ తో బ్లాక్ బస్టర్ జర్నీ చేసిన దర్శకుడు ఎ.కోదండ రామిరెడ్డి. అయితే తండ్రి ఇంత పెద్ద డైరెక్టర్ కోసం టఫ్ ఫైట్ చేస్తూనే ఉన్నాడు. గొడవతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన వైభవ్ ఈ 13ఏళ్ల కెరీర్ లోనే సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యాడు.

టాలీవుడ్ లో చాలా మంది హీరోల ఇమేజ్ ని మార్చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇక తండ్రి గైడెన్స్ లో హీరో అయిన ఆకాశ్ పూరీ ఇంకా సొంత మార్క్ చూపించలేదు. పూరీ డైరెక్షన్ లోనే ఆకాశ్ చేసిన మెహబూబా సినిమా కూడా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

శతమానం భవతి సినిమాతో అవార్డులు అందుకున్న దర్శకుడు సతీశ్ వేగేశ్న కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కోతి కొమ్మచ్చిలో ఒక హీరోగా చేస్తున్నాడు సమీర్ వేగేశ్న. అయితే స్టార్ డైరెక్టర్ల వారసులే స్టార్డమ్ సంపాదించుకోవడానికి కష్టపడుతున్నారు.దీంతో సమీర్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో అని మాట్లాడుకుంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.

మొత్తానికి స్టార్ డైరెక్టర్లకు కొత్త భయం పట్టుకుంది. వాళ్లను సెంటిమెంట్ అనేది నీడలా వెంటాడుతూనే ఉంది. తమ జీవితం సక్సెస్ ఫుల్ గా గడిచిపోయింది.. తమ పిల్లలు ఏ విధంగా రాణించగలుగుతారో అనే భయం వారిలో నెలకొంది.
చూద్దాం.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల వారసులు ముందు ముందు ఎలాంటి ప్రయోగాలతోప ప్రేక్షకుల ముందుకు వస్తారో.








మరింత సమాచారం తెలుసుకోండి: