ఇది ఇలా ఉండగా..నాగ్ మన్మథుడు 2 సినిమా తర్వాత ఇప్పటివరకు సినిమాలు చేయలేదు. ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో అలరించనున్నాడు.. ప్రయోగాత్మక చిత్రంగా వైల్డ్ డాగ్ సినిమా రూపొందుతుంది..ఆ సినిమా దాదాపు లాక్ డౌన్ ముందు సినిమా చిత్రీకరణ ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు మిగితా పార్ట్ చిత్రీకరణను చిత్ర యూనిట్ పూర్తి చేసే పనిలో పడ్డారు.. ఒక వైపు బిగ్ బాస్ మరో వైపు సినిమాలు ఇవన్నీ కూడా నాగ్ ను ఇరకాటంలో పడేసింది. లాస్ట్ ఎపిసోడ్ లో కోడలు సమంత తో బిగ్ బాస్ షో చేయించాడు..
తాజాగా ముంబై పయనమయ్యారు. ఆర్ధిక రాజధానిలో 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు.అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో ఆర్కియాలజిస్టుగా కీలక పాత్రలో నటిస్తున్నారు నాగార్జున. లాక్‌డౌన్ కంటే ముందే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కొంతమేర షూటింగ్ జరుపుకొని వాయిదా పడింది. రీసెంట్‌గా తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయడంతో నాగార్జున తన డేట్స్ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పటికే ముంబై చేరుకున్న ఆయన పది రోజుల పాటు అక్కడే ఉంటాడని సమాచారం.. అయితే ఇంకో రెండు రోజుల్లో బిగ్ బాస్ వీకెండ్ షో రానుంది. మరి ఆ షో కు హోస్ట్ గా ఈసారి రోజా సెల్వమని రానుందని వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది..చూడాలి మరి ఎవరు ఎంట్రీ ఇవ్వనున్నారో..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి