మరికొందరు వచ్చే నెల నుండి తమ సినిమాల షూటింగ్ కు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో రానా లో మాత్రం ఇంకా చలనం రాలేదు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు రానా మాత్రం ఇప్పటిలో వరకు కెమెరా ముందుకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా అనిపించడం లేదు అన్న లీకులు వస్తున్నాయి.
ప్రస్తుతం రానా ఫలానా సినిమాలో నటిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి కానీ ఆ సినిమాలు ఏమి మొదలు కావడంలేదు. రానా నటించిన ‘అరణ్య’ సినిమా షూటింగ్ పూర్తి అయి విడుదలకు సిద్దంగా ఉంది. ఈ మూవీ సంక్రాంతి విడుదల అని అంటున్నారు. రానా విరాటపర్వం సినిమాలో కూడ నటిస్తున్నాడు.
ఆ సినిమా గురించి గత ఏడాదిన్నరగా వార్తలు వస్తున్నాయి కానీ అది ఎప్పుడు విదుల అవుతుందో అన్న క్లారిటీ లేదు. ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ అప్పుడప్పుడు విడుదల చేసి హడావిడి చేస్తునారు కానీ ఈ మూవీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి రానా పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి పవన్ తో తీయబోతున్న మళయాళ రీమేక్ రానా ఎంపిక ఖరార్ అయినప్పటికీ రానా వైపు నుండి మాత్రం ఇంకా పూర్తి గ్రీన్ సిగ్నల్ రాలేదు అని అంటున్నారు. దీనితో రానా ఇప్పట్లో కెమెరా ముందుకు వచ్చే ఆలోచనలు చేయడం లేదా లేదంటే తన భార్య మిహిక ను వదలిపెట్టలేక మరికొంత కాలం గ్యాప్ తీసుకుంటున్నాడ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి