దీంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత విజయ్ ఆంటోని ఎన్నో విభిన్నమైన కాన్సెప్ట్ ల తో కూడిన సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే బిచ్చగాడు సినిమా టాలీవుడ్లో కూడా విజయం సాధించడం తో ఇక తాను నటించిన అన్ని సినిమా లు తమిళం కన్నడ భాషల తో పాటు తెలుగు లో కూడా విడుదల చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే టాలీవుడ్లో కూడా విజయ్ ఆంటోని ఎంతో మంది అభిమానుల ను సంపాదించుకున్నాడు.
ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం విజయ్ ఆంటోని కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆనంద్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయరాఘవన్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎంతో ఆసక్తికరంగా ఉంది ఎత్తైన భవంతుల పై దర్జాగా కూర్చున్న విజయ్ ఆంటోని చూసి అభిమానులు అందరూ మురిసిపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి